Sonia Gandhi: అధ్యక్ష పదవికి సోనియా రాజీనామా..?

Sonia Gandhi:  అధ్యక్ష పదవికి సోనియా రాజీనామా..?
x

Will Sonia Gandhi Resign As Congress Interim President ?

Highlights

Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఎన్నో ద‌శాబ్దాల చ‌రిత్ర ఉన్నకాంగ్రెస్ పార్టీ సరైన నాయ‌క‌త్వం లేక అప‌జ‌యాల‌ను మూట గ‌ట్టుక‌ట్టుంది.

Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఎన్నో ద‌శాబ్దాల చ‌రిత్ర ఉన్నకాంగ్రెస్ పార్టీ సరైన నాయ‌క‌త్వం లేక అప‌జ‌యాల‌ను మూట గ‌ట్టుక‌ట్టుంది. పార్టీ ప‌రిస్థితి రోజురోజుకు దిగ‌జారుతున్న క్ర‌మంలో సోనియా గాంధీ అధ్య‌క్ష పీఠం నుంచి త‌ప్పుకొనున్న‌ట్టు ఊహాగానాలు రావ‌డంతో కాంగ్రెస్ శ్రేణిలో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతుంది.

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో సీనియర్ల ఒత్తిడి మేరకు సోనియానే తాత్కాలిక అధ్య‌క్షురాలుగా పార్టీ పగ్గాలు చేత‌బ‌డ్డారు. కానీ పార్టీలోని అంతర్గత సంక్షోభాలు పెద్ద తలపోటుగా మారాయి. అలాగే మొత్తం జాతీయ నాయకత్వలోనే మార్పులు తీసుకురావల్సిన అవసరముందున్న అభిప్రాయం ముందుకు వ‌స్తుంది . ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ను సమూల మార్పులు అవసరమని పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు గళాలెత్తారు. ఏకంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీకే వాడివేడిగా లేఖలు రాయడం గమనార్హం.

ఈనేపథ్యంలో రేపు జరగబోయే సీడబ్ల్యూసీ భేటీలో కీల‌క ప‌రిమాణాల‌కు తెర‌తీయ‌నున్న‌ట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతలోనే సోనియాగాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లుగా వార్తలు వస్తుండటంతో కాంగ్రెస్ నేతలు డైలామాలో పడ్డారు. ఈ నిర్ణ‌యంపై ఎలాంటి అధికార ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. ఎంతో ఘనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ చరిత్ర మనకబారుతోందన్నారు.స‌మ‌ర్థ‌వంత‌మైన అధ్యక్షుడిని కూడా ఎన్నుకోలేని స్థితిలో చుక్కాని లేని నావలా తయారైందని తెలిపారు. ఈ క్ర‌మంలో నూత‌న అధ్య‌క్ష బాధ్య‌త‌లు ఎవ‌రు చేబ‌డుతారో వేచిచూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories