కరోనా నిబంధనల ఉల్లంఘుల కోసం ఓపెన్‌ జైళ్లు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు..

Will Set Up Open Jails For COVID Protocol Violators Says Narottam Mishra
x

కరోనా నిబంధనల ఉల్లంఘుల కోసం ఓపెన్‌ జైళ్లు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు..

Highlights

Narottam Mishra: మధ్యప్రదేశ్ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Narottam Mishra: మధ్యప్రదేశ్ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించే వారికోసం ఓపెన్ జైళ్లు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామన్నారు హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా. మధ్యప్రదేశ్‌లో లాక్‌డౌన్ విధించడం లేదా మార్కెట్‌లను మూసివేసే ప్రతిపాదన లేదన్నారు. అయితే, ముఖానికి మాస్క్ ధరించని వారికోసం ఓపెన్ జైళ్లను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నామన్నారు.

మంత్రి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో కోవిడ్ ప్రోటోకాల్‌లను ఉల్లంఘించిన వారికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం రూ.200 జరిమానా విధిస్తున్నది. అలాగే ప్రజలు మాస్క్‌లు ధరించేలా, కరోనా నియమాలు అనుసరించేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 'రోకో టోకో' కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నది.


Show Full Article
Print Article
Next Story
More Stories