ఏమిటీ ఫోబియా....ఎందుకీ ఫోబియా ?

ఏమిటీ ఫోబియా....ఎందుకీ ఫోబియా ?
x
Highlights

తల్లి తన చిన్నారి ముద్దు బిడ్డకు గోరు ముద్దలు తినిపిస్తుంది. తిననంటూ బిడ్డ మారాం చేస్తే బూచాడిని పిలుస్తానని బెదిరిస్తుంది. అలా పిల్లలకు చిన్నతనంలోనే...

తల్లి తన చిన్నారి ముద్దు బిడ్డకు గోరు ముద్దలు తినిపిస్తుంది. తిననంటూ బిడ్డ మారాం చేస్తే బూచాడిని పిలుస్తానని బెదిరిస్తుంది. అలా పిల్లలకు చిన్నతనంలోనే బూచాడి భయం పట్టుకుంటుంది. కొందరిలో అది పెద్దయ్యాక కూడా కొనసాగుతుంటుంది. ఇక కొందరికి నీళ్లంటే భయం మరికొందరికి బల్లి అంటే భయం ఇంకొందరికి బొద్దింక అంటే భయం ఇలా ఎన్నో రకాల భయాలు వీటినే ఫోబియాలుగా వ్యవహరిస్తుంటారు. ఇవన్నీ వ్యక్తిగతం దాంతో పెద్దగా ఇబ్బంది లేదు. కొన్ని ఫోబియాలు మాత్రం సామాజికం. మొన్నటి వరకూ దేశంలో ఎక్కడ చూసినా ఒకటే పదం వినిపించింది. దాని పేరు ఇస్లామోఫోబియా. సోషల్ మీడియాలో ఈ ఇస్లామోఫోబియా గురించి విపరీతమైన వాదనలు, ప్రతివాదనలు జరిగాయి. ఈ వివాదం ఒకవైపు నడుస్తుండగానే తాజాగా హిందూఫోబియా కూడా తెరపైకి వచ్చింది. ఈ రోజు మనం మాట్లాడుకుందాం ఎవరు ఎందుకు ఈ ఫోబియాలను సృష్టిస్తున్నారు దాని వల్ల చివరకు ఏం సాధిస్తారు అనే అంశం గురించి.

తాజాగా దేశంలో రెండు, మూడు వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. వాటిపై వచ్చిన కామెంట్లు చూస్తే మీ మతం మీదే....మా మతం మాదే... మీరు వేరు...మేము వేరు.....అనే అంతగా విద్వేషం పెంచేలా కనిపిస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఈ వీడియోల్లో రెచ్చగొడుతున్నటువంటి మూర్ఖులను మతవిద్వేషకులుగానే చూడాల్సి వస్తుంది. భారత సమాజంలో లౌకిక రాజ్యం అనే బలమైన గోడను బద్దలుకొట్టేందుకు కంకణం కట్టుకున్నారా అనిపిస్తుంది. ఆ వీడియో కథ ఏమిటో చూద్దాం.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories