WHO: ఆ రెండు దగ్గుమందులు వాడొద్దు.. హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

WHO Alert Two Indian Syrups After Uzbekistan19 Child Deaths
x

WHO: ఆ రెండు దగ్గుమందులు వాడొద్దు.. హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Highlights

WHO: నోయిడా మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్‌లు

WHO: నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన రెండు దగ్గు సిరప్‌లను ఉజ్బెకిస్తాన్‌లోని పిల్లలకు ఉపయోగించొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. ఉజ్బెకిస్తాన్‌లో 19 మంది మరణాలకు కారణమైన తర్వాత, భారతదేశానికి చెందిన మారియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గు సిరప్‌లను పిల్లలకు ఉపయోగించకూడదని W H O ప్రకటించింది. రెండు ఉత్పత్తులు AMBRONOL సిరప్ , DOK-1 మాక్స్ సిరప్‌లలో డైథైలీన్ గ్లైకాల్, ఆమోదయోగ్యం కాని మొత్తంలో ఇథిలీన్ ఉన్నట్లు లాబొరేటరీ విశ్లేషణలో వెల్లడయింది. ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది చిన్నారుల మరణానికి కారణమైన మారియన్ బయోటెక్ కంపెనీ ఉత్పత్తి లైసెన్స్‌ను ఉత్తరప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ సస్పెండ్ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories