White Fungus: వామ్మో..బ్లాక్ కాదు వైట్ ఫంగ‌స్ య‌మా డేంజ‌ర్

white Fungus
x

వైట్ ఫంగ‌స్ ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Highlights

White Fungus: ఓ పక్క కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్ర‌భావంతో జ‌నం జంక్కుతుంటే..మ‌రో వైపు బ్లాక్ ఫంగ‌స్ అన్ని రాష్ట్రాల‌ను చూట్టేస్తూ జ‌న‌నాన్ని కంగారు...

White Fungus: ఓ పక్క కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్ర‌భావంతో జ‌నం జంక్కుతుంటే..మ‌రో వైపు బ్లాక్ ఫంగ‌స్ అన్ని రాష్ట్రాల‌ను చూట్టేస్తూ జ‌న‌నాన్ని కంగారు పెడుతుంటే.. ఇంత‌లోనే శాస్త్ర‌వేత్త‌లు మ‌రో బాంబ్ పెల్చారు. బ్లాక్ కాదు వైట్ ఫంగస్ యమా డేంజ‌ర్ అంటూన్నారు. ఈ వైట్ ఫంగస్ ఎక్కువగా ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంద‌ని చెబుతున్నారు. ఈ ఫంగ‌స్ సోకితే మ‌నిషి ప్రాణానికే ప్ర‌మాద‌ని వైద్యులు అంటున్నారు.

వైట్ ఫంగస్ గురించి వైద్యులు చెపుతున్న దాని ప్రకారం వైట్ ఫంగస్ కన్నా బ్లాక్ ఫంగస్ చాలా ప్రమాదకారి. తాజాగా బీహార్ లో వైట్ ఫంగస్ వెలుగులోకి వచ్చింది. బీహార్ లోని పాట్నాలో నలుగురికి వైట్ ఫంగస్ వ్యాధి నిర్ధారణ అయింది. వీరికి కరోనా టెస్టుల్లో నెగెటివ్ రిపోర్టులు వచ్చినప్పటికీ వీరికి వైట్ ఫంగస్ సోకినట్టు స్పష్టమైంది. అయితే, వీరికి యాంటీ ఫంగల్ ఔషధాలను ఇవ్వడంతో ఆ వ్యాధి నుంచి కోలుకున్నారు

వైట్ ఫంగస్ సోకినవారిలో వారి ఊపిరితిత్తులు, చర్మం, గోళ్లు, కడుపు, మూత్రపిండాలు, మెదడు, మర్మావయవాలు, నోరు ప్రభావితమవుతాయి. ఈ ఫంగస్ ను హెచ్ఆర్సీటీ ద్వారా గుర్తించవచ్చు. ఈ వైట్ ఫంగ‌స్ ఎక్కువగా స్టెరాయిడ్లు తీసుకునేవారికి, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారికి, డయాబెటిస్ బాధితులకు ఈ వైట్ ఫంగస్ ఎక్కువగా సోకే అవకాశం ఉంది.

క‌రోనా నుంచి దేశం పూర్తిగా కోలుకోక ముందే బ్లాక్ ఫంగస్ నెమ్మదిగా అన్ని రాష్ట్రాలకు పాకుతూ జనాలను భయాందోళనలకు గురి చేస్తోంది. ఇప్పటికే రెండు, మూడు రాష్ట్రాలు ఈ ఫంగస్ ను తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో దీని ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. ఇప్ప‌టికే కేంద్ర బ్లాక్ ఫంగ‌స్ ను అంటూవ్యాధిగా గుర్తించాల‌ని అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు తెలిపింది. బ్లాక్ ఫంగ‌స్ కేసును గుర్తించి వారికి వెంట‌నే చికిత్స ఇవ్వాల‌ని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories