CM KCR: లక్ష్యం లేని దేశం ఎక్కడకు వెళ్తోంది

Where Is A Country Going Without A goal Says CM KCR
x

 CM KCR: లక్ష్యం లేని దేశం ఎక్కడకు వెళ్తోంది 

Highlights

CM KCR క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీ ఓడింది.. కాంగ్రెస్ గెలిచింది

CM KCR: లక్ష్యం లేని దేశం ఎక్కడకు వెళ్తోందని బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రశ్రించారు. దేశంలో ఎలాగైనా ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం ల‌క్ష్యంగా మారిందని, ఎన్నిక‌ల రాజకీయతంత్రంలో దేశం చిక్కుకుపోయిందన్నారు. ప్రతి ఎన్నికలోనూ నేతలు కాదు.. ప్రజలు గెలవాలన్నారు. మ‌హారాష్ట్రలో 8 రోజుల‌కు ఒక‌సారి తాగునీరు వ‌స్తుంది. గంగా, య‌మునా డెల్టా ప్రాంత‌మైన ఢిల్లీలోనూ ఇదే దుస్థితి ఉంది. ఢిల్లీలో తాగునీరే కాదు.. విద్యుత్ కొర‌త స‌మ‌స్య కూడా ఉంద‌ని తెలిపారు కేసీఆర్.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీ ఓడింది.. కాంగ్రెస్ గెలిచింది. ప‌రిస్థితుల్లో మార్పు రాన‌ప్పుడు ఎవ‌రు గెలిచి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. గ‌తంలో తెలంగాణ‌లో మ‌హారాష్ట్ర కంటే ఎక్కువ‌గా రైతు ఆత్మహత్యలు జరిగేవి. ఇప్పుడు తెలంగాణ‌లో సాగుకు 24 గంట‌ల ఉచిత విద్యుత్ ల‌భిస్తోంది. పుష్కలంగా సాగునీరు కూడా అందిస్తున్నాం. తెలంగాణ‌లో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా త‌గ్గిపోయాయని కేసీఆర్ తెలిపారు.

మ‌హారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అంతకుముందు పార్టీ కార్యాల‌యం ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంత‌రం రిబ్బన్‌కట్‌ చేసి పార్టీ ఆఫీసులోకి ప్రవేశించారు. కార్యాల‌యంలో లోప‌ల నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశ‌వ‌రావు, సంతోష్ కుమార్ పాల్గొన్నారు. మరోవైపు.. కేసీఆర్‌ పర్యటన సందర్భంగా నాగ్‌పూర్‌ పట్టణమంతా బీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, జెండాలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా 'అబ్‌ కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌' హోర్డింగ్‌లు దర్శనమిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories