What is Color Smoke: గ్యాస్ కనిస్టర్లంటే ఏమిటి ?

What is Colour Smoke Bomb
x

What is Color Smoke: గ్యాస్ కనిస్టర్లంటే ఏమిటి ?

Highlights

What is Color Smoke: వీటిని స్మోక్ బాంబులు, పొగ డబ్బాలు అని పిలుస్తారు

What is Color Smoke: లోక్‌సభ లోపలికి ఆగంతకులు ప్రవేశించి బుధవారం గందరగోళం సృష్టించారు. సందర్శకుల గ్యాలరీ నుంచి ఒక్కసారిగా సభలోకి దూకి టియర్‌ గ్యాస్‌ వదిలారు. దీంతో ఎంపీలంతా భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. నిందితులను పట్టుకుని సిబ్బందికి అప్పగించారు. పార్లమెంట్‌పై దాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన వేళ ఈ ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే.. నిందితులు బూట్లలో గ్యాస్ క్యానిస్టర్లను దాచుకుని వెంట తెచ్చుకున్నారు. అసలు ఏంటి ఈ గ్యాస్ క్యానిస్టర్లు? ఎక్కడ ఉపయోగిస్తారు ?

వీటిని గ్యాస్ క్యానిస్టర్లను స్మోక్ బాంబులు, పొగ డబ్బాలు అని కూడా పిలుస్తుంటారు. వీటిని బహిరంగంగా ఉపయోగించేందుకు చట్టబద్ధత ఉంది. సినిమాలు, ఫొటోషూట్‌లలో పొగ తెరలను సృష్టించడానికి, మిలిటరీ విభాగాల్లోనూ వీటిని ఉపయోగిస్తుంటారు. శత్రువుల కళ్లను పొగతో ఏమార్చడానికి వాడుతారు. క్రీడలలో ముఖ్యంగా ఫుట్‌బాల్‌లో అభిమానులు తమ క్లబ్‌ల రంగులను ప్రదర్శించడానికి పొగ డబ్బాలను ఉపయోగిస్తారు. లోక్‌సభలో టియర్‌ గ్యాస్‌ ప్రయోగానికి సంబంధించి నిందితులను సాగర్ శర్మ, మనోరంజన్‌, అమోల్ షిండే, నీలం దేవి కౌర్‌, లలిత్ ఝా, విక్కీ శర్మలుగా గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories