భారత్‌పై క్లౌడ్ బరస్ట్ ప్రయోగం జరిగిందా?.. క్లౌడ్ బరస్ట్ టెక్నాలజీపై నిజానిజాలేంటి?
Cloudburst: మాన్సూన్ సీజన్‌లో వర్షాలు కురవడం కామన్.. కానీ ఆకాశమే చిల్లుపడిందా అన్న రేంజ్‌లో కురిస్తే..?
Cloudburst: మాన్సూన్ సీజన్‌లో వర్షాలు కురవడం కామన్.. కానీ ఆకాశమే చిల్లుపడిందా అన్న రేంజ్‌లో కురిస్తే..? ఒక్క వర్షాకాలమే కాదు మండే ఎండల్లోనూ ఆకస్మిక వరదలు సంభవిస్తే..? ప్రకృతి ప్రకోపం అని సరిపెట్టుకోవాలా..? లేక, శత్రువుల కుట్రకోణం ఉందని అనుమానించాలా..? ఈ అనుమానాలకు అసలు కారణం క్లౌడ్ బరస్ట్. అవును మీరు వింటుంది నిజమే దశాబ్దాలుగా అగ్రదేశాలు ఫోకస్ చేసిన ఈ టెక్నాలజీనే ప్రపంచ దేశాల్లో ఆకస్మిక వరదలకు కారణమవుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 1967లో ఇదే క్లౌడ్ బరస్ట్ టెక్నాలజీతో అమెరికా వియాత్నాంపై యుద్ధం గెలిస్తే డ్రాగన్ కంట్రీ చైనా, దుబాయ్‌లు కూడా ఈ ప్రయోగాల్లో సక్సెస్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే భారత్‌లో వరదల వెనుక డ్రాగన్ కంట్రీ కుట్రకోణముందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకూ, ఎంటీ క్లౌడ్ బరస్ట్ టెక్నాలజీ..? ఇండో-చైనా సరిహద్దుల్లో ఆకస్మిక వరదలకు ఇదే కారణమా..? అమెరికా, వియాత్నాం యుద్ధంలో క్లౌడ్ బరస్ట్ పాత్రేంటి..?
క్లౌడ్ బరస్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకే ఒక్క కామెంట్‌తో దేశం అటెన్షన్ మొత్తం దీనిపైనే. నిజానికి క్లౌడ్ బరస్ట్ అంశం కొత్తదేం కాదు. దీనిపై దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. మారుతున్న కాలంతో పాటు కొత్త కొత్త ప్రయోగాలు చేపట్టేందుకు ప్రపంచ దేశాలు పోటీ పడుతూన్నాయి. ఒకరిపై మరొకరు ఆదిపత్యం చాటేందుకు హద్దులు దాటి మరీ ప్రయోగాలు చేస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ప్రకృతినే టార్గెట్ చేసే స్థాయికి కొన్ని దేశాలు చేరుకున్నాయి. వాటిల్లో అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ కంట్రీ చైనా, ఎడారి దేశం దుబాయ్‌లు ముందున్నాయి. అయితే, క్లౌడ్ బరస్ట్ టెక్నాలజీని అవసరానికి వర్షం కోసం వాడుకుంటే మంచిదే కానీ ఇతర దేశాలను టార్గెట్ చేయాలనే ఆలోచన వస్తేనే అసలు సమస్య అంతా. ప్రపంచంపై ఆదిపత్యం చెలాయించాలనే డ్రాగన్ కంట్రీ చైనా సరిగ్గా ఇలాంటి కుట్రలు చేస్తుందన్న అనుమానాలే ఇప్పుడు టెన్షన్ పెడుతున్నాయి.
20 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో ఒక గంటలో 10 సెంటీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ వర్షం కురిస్తే దానిని మేఘాల విస్ఫోటనం లేదా క్లౌడ్ బరస్ట్ అని పిలుస్తారు. దీన్ని ప్రయోగిస్తే తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో వాన కురుస్తుంది. ఆ తర్వాత పెద్ద ఎత్తున వరద ముంచెత్తుతుంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతాయి. చుట్టు పక్కల ప్రాంతాలన్నీ జలమయమైపోతాయి. ఊహించని సంఖ్యలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించి ఒక్కోసారి దేశ ఆర్ధిక వ్యవస్థపైనే పెను భారమైపడుతుంది. ఆ తర్వాత వరదలకు గురైన దేశం తిరిగి సాధారణ పరిస్థితులకు రావాలంటే కొన్నేళ్లు పట్టొచ్చు. ఓ దేశం పతనం కోరుకునే కుట్ర దేశాలకు ఇంతకంటే ఏం కావాలి..? గత కొన్నేళ్లుగా హిమాలయాల్లో జరుగుతున్నది కూడా ఇదే. 2013లో ఉత్తరాఖండ్ వరదల నుంచి మొన్నటి అమర్‌నాథ్ ఫ్లడ్స్ వరకూ కారణం క్లౌడ్ బరస్ట్ అన్న అనుమానాలున్నాయి. అది కూడా పొరుగు దేశం డ్రాగన్ కంట్రీ కుట్రగా పలు విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ అనుమానాలకు కారణాలు లేకపోలేదు. పొరుగు దేశం చైనా గతంలో పలుమార్లు వర్షాలను కంట్రోల్ చేసే టెక్నాలజీని ఉపయోగించింది. తమకు కావాలనుకున్నప్పుడు వర్షాలను కురిపించడం, వద్దనుకున్నప్పుడు ఆగిపోయేలా చేయడంలో డ్రాగన్ కంట్రీకి అనుభవముంది. 2008లో చైనా రాజధాని బీజింగ్‌లో ఒలింపిక్స్ జరిగాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంగ్రామం జరుగుతున్నప్పుడు వర్షం పడితే..? ఈ అనుమానంతోనే చైనా ఫస్ట్ టైం వెదర్ మాడిఫికేషన్ టెక్నిక్స్‌ని ఉపయోగించి వర్షం పడకుండా చేసింది. ఏదైనా స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు వర్షం పడే సూచనలు కనిపిస్తే ఆరోజున పడకుండా ఉండేందుకు ముందు రోజుల్లోనే పడేలా చేస్తారు. మేఘాలన్నింటినీ వర్షింపజేసి ఆకాశాన్ని క్లియర్ చేసేస్తారు. అప్పుడు ఆ స్పోర్ట్స్ ఈవెంట్ సజావుగా జరుగుతుంది. 2008లో ఈ టెక్నాలజీనే ఉపయోగించింది చైనా. ఉప్పు, ఖనిజాలను నింపిన బుల్లెట్లను ఆకాశంలోని మేఘాలపైకి షూట్ చేసి ఆర్టిఫిషియల్ వర్షాన్ని కురిపించి ఒలింపిక్స్‌కు ఎలాంటి ఆటంకం ఎదురుకాకుండా చూడడంలో సక్సెస్ అయిందన్న విశ్లేషణలు వినిపించాయి.
అయితే, చైనా కంటే ముందే అగ్రరాజ్యం అమెరికా ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించింది. అయితే, అది శత్రువును ఓడించేందుకు ప్రయోగించింది. 1967లో వియత్నాం యుద్ధం సమయంలో ది ఆపరేషన్ పొపియే పేరుతో క్లౌడ్ బరస్ట్ చేసి వియత్నాంను దెబ్బకొట్టిందని పలువురు చరిత్రకారులు చెబుతున్నారు. అమెరికా మిలటరీ సిల్వర్ అయెడైడ్ బుల్లెట్లను మేఘాలపైకి ప్రయోగించి చూసి తద్వారా వాటిని చల్లబరిచి, కుండపోత వానలు కురిపించిందట. హోచిమిన్ సిటీపై భారీ వర్షాలు కురిపించి, ప్రతికూల వాతావరణ పరిస్థితులను కల్పించారట. ఆకస్మిక వర్షాలు, వరదలు, విరిగిపడిన కొండచరియలతో వియత్నాం సైనికులు అమెరికాను ఎదుర్కోలేకపోయారనే వార్తలు వినిపించాయి. ఈ ఆర్టిఫిషియల్ వర్షాలతో రోడ్లు తెగిపోవడం, కాలనీలన్నీ నీట మునగడంతో వియాత్నాం సైనికులు ఆయుధ సామాగ్రితో ముందుకు వెళ్లలేకపోయారు. ఒక్కమాటలో క్లౌడ్ బరస్ట్ వల్లే వియత్నాంపై అమెరికా పైచేయి సాధించిందని హిస్టరీ చెబుతోంది.
నిజానికి క్లౌడ్ బరస్ట్‌ను ప్రయోగించిన జాబితాలో ఎడారి దేశం దుబాయ్ కూడా ఉంది. వేసవిలో 50 డిగ్రీల ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు దుబాయ్‌లో కృత్రిమ వర్షం కురిపించారు. ఇందుకు క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ పద్దతిలో ముందుగా సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయొడైడ్, డ్రై ఐస్ వంటి రసాయనాలను విమానాలు, హెలికాప్టర్లతో తీసుకెళ్లి ఆకాశంలో చల్లుతారు. ఇవి గాల్లో ఉన్న తేమను ఒక దగ్గరకు ఆకర్షిస్తాయి. ఆ తర్వాత నీట కణాలన్నీ ఒకే దగ్గరికి రావడంతో పెద్ద పెద్ద క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. ఆ మేఘాలను ఎలక్ట్రిసిటీతో చార్జ్ చేసి ఘనీభవించేలా చేసి వర్షం కురిపిస్తారు. ఈ పద్దతిలో వర్షం కురిపించేందుకు కేవలం అరగంట నుంచి గంట సమయం మాత్రమే పడుతుంది.
ఇక మనదేశంలో 1970 నుంచి 2016 వరకు దాదాపు 30కి పైగా క్లౌడ్ బరస్ట్ ఘటనలు జరిగాయి. అవికూడా హిమాలయ ప్రాంతంలోనే చోటుచేసుకున్నాయి. జమ్మూకశ్మీర్, లఢాఖ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో క్లౌబ్ బరస్ట్‌ల వల్ల కుండపోత వర్షాలు పడి వరదలు ముంచెత్తాయి. 2013లో ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ వల్ల కేదార్‌నాథ్‌ను ఆకస్మిక వరదలు ముంచెత్తినట్టు విశ్లేషణలు వినిపించాయి. ఆ సమయంలో కనీవినీ ఎరుగని రీతిలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. 5వేల మందికిపైగా మరణించారు. అలాగే, అస్సాంలో ప్రతి ఏటా వందలాది మంది ఆకస్మిక వరదల వల్ల మరణిస్తున్నారు. వీటన్నింటికీ కారణం శత్రుదేశం డ్రాగన్ కంట్రీనే అనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఈ డేంజర్ క్లౌడ్ బరస్ట్‌లు ఎక్కువగా ఇండియా, చైనా సరిహద్దు ప్రాంతాల్లో జరగడమే. దీంతో తాజా వరదల వెనుక కూడా డ్రాగన్ కంట్రీ కుట్ర ఉందనే అనుమానాలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ భారత్‌తో పాటు పలు దేశాల్లో ఆకస్మిక వరదలకు ఈ క్లౌడ్ బరస్ట్ టెక్నాలజీనే కారణమనేది నిజమే అయితే రానున్నవన్నీ గడ్డురోజులే. ఈ తరహా వరద విధ్వంసంతో ఇతర దేశాలపై ఆదిపత్యం చెలాయించే వీలుంటే ప్రతి దేశం ఆదిశగా ప్రయోగాలు చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. అదే జరిగి ఆయా దేశాలు క్లౌడ్ బరస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే పనికట్టుకుని ప్రకృతి విపత్తులను మానవాళే సృష్టించినట్టవుతుంది. ఇప్పటికే గ్లొబల్ వార్మింగ్‌తో ఊహించని విధంగా మారిపోతున్న వాతావరణ పరిస్థితులు ఇలాంటి టెక్నాలజీతో పూర్తిగా మానవ మనుగడను ప్రశ్నార్ధంగా మార్చేస్తాయంటున్నారు సైంటిస్టులు. ఏది ఏమైనా ఎలాంటి అవసరాల కోసమైనా ప్రకృతికి వ్యతిరేకంగా చేసే ప్రయోగాలు చివరికి ఊహించని విపత్తులకు కారణమవుతాయని ఇప్పటికే ఎన్నో ఘటనలు నిరూపించాయి. ఇక రానున్న రోజుల్లో డేంజర్ క్లౌడ్స్ ఎలాంటి విధ్వంసాలకు కారణమవుతుందో వేచి చూడాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire