Bengal Assembly: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో యాంటీ రేప్ బిల్లు

West Bengal Government Today Tabled Anti Rape Bill At State Assembly
x

Bengal Assembly: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో యాంటీ రేప్ బిల్లు 

Highlights

Bengal Assembly: సభలో ప్రవేశపెట్టిన మంత్రి మోలే ఘాటక్

Bengal Assembly: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలో యాంటీ రేప్ బిల్లును ప్రవేశపెట్టారు. న్యాయశాఖ మంత్రి మోలే ఘాటక్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అత్యాచార నిందితులకు మరణ దండన విధించే రీతిలో బిల్లులో ప్రతిపాదనలు చేశారు. రేప్, గ్యాంగ్ రేప్ కేసుల్లో నిందితులకు పెరోల్ లేకుండా జీవితకాల శిక్ష వేయాలన్న సూచన చేశారు. బిల్లును అపరాజితా వుమెన్ అండ్ చైల్డ్ బిల్లు 2024గా పిలుస్తున్నారు. మహిళలు, పిల్లల రక్షణకు కొత్త చట్టాన్ని రూపొందించారు. ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఇటీవల ట్రైనీ వైద్యురాలు హత్యాచారానికి గురైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో దీదీ సర్కార్ కఠిన చట్టాలతో కూడిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.


Show Full Article
Print Article
Next Story
More Stories