West Bengal Election 2021: ఇవాళ నందిగ్రామ్ లో దీదీ నామినేషన్

Mamata Banerjee to file nomination from Nandigram today
x

ఇవాళ నందిగ్రామ్ లో దీదీ నామినేషన్ (ఫైల్ ఇమేజ్ )

Highlights

West Bengal election 2021: గత కొద్ది రోజులుగా సెంటర్ ఆఫ్ పాలిటిక్స్‌గా మారిన నందిగ్రామ్‌లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ నామినేషన్ వేయనున్నారు....

West Bengal election 2021: గత కొద్ది రోజులుగా సెంటర్ ఆఫ్ పాలిటిక్స్‌గా మారిన నందిగ్రామ్‌లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ నామినేషన్ వేయనున్నారు. బీజేపీ అభ్యర్థిని ఢీకొట్టేందుకు నిర్ణయం తీసుకున్న దీదీ ఈ ఎన్నికల్లో కేవలం నందిగ్రామ్ నుంచే పోటీ చేయనున్నట్లు ప్రకటించనున్నారు. మార్చి 27న ఈ నియోజకవర్గంలో తొలివిడత ఎన్నికలు జరగనుండటంతో ఇవాళ నామినేషన్ వేస్తున్నారు మమతా బెనర్జీ.

అటు టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారి కూడా ఈ శనివారం నందిగ్రామ్‌లో నామినేషన్ వేయనున్నారు. దీదీపై 50వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని సవాల్ చేశారు. దీంతో త్వరలో జరిగే మినీ సంగ్రామంలో నందిగ్రామ్‌ సెంటర్ ఆఫ్ పాలిటిక్స్‌గా నిలిచింది. అయితే నందిగ్రామ్‌లో దీదీ నాన్‌ లోకల్‌ అని బీజేపీ కామెంట్ చేయడంపై దీదీ ఫైర్ అయ్యారు. తాను నాన్ లోకల్ అయితే ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ నేతలు ఎవరని ప్రశ్నించారు. ప్రజల కోసం వచ్చానని వాళ్లు వద్దంటే నామినేషన్ వేయనన్నారు. లోకల్ నినాదంతో ప్రచారంలో ముందుకెళ్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories