పశ్చిమ బెంగాల్ లో కొలువుదీరిన కొత్త మంత్రులు

West Bengal Cabinet Reshuffle
x

పశ్చిమ బెంగాల్ లో కొలువుదీరిన కొత్త మంత్రులు

Highlights

West Bengal Cabinet: మంత్రివర్గ పునర్వయవస్థీకరణలో తొమ్మిది మందికి ఛాన్స్

West Bengal Cabinet: పశ్చిమబెంగాల్ లో తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త మంత్రులు కొలువు దీరారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తొమ్మిది మంది కొత్తవారికి సీఎం మమత బెనర్జీ మంత్రి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో మాజీ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోతో పాటు స్నేహశీష్ చక్రవర్తి, పార్థా బౌమిక్, ఉదయన్ గుహా, ప్రదీప్ మజుందర్, తజ్మల్ హుస్సేన్, సత్యజిత్ బర్మన్ ఉన్నారు. స్వతంత్ర హోదా కల్గిన మంత్రులుగా బిర్బహ హన్సంద, బిప్లబ్ రాయ్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ లా గణేషన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. 2021లో బెంగాల్ లో టీఎంసీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం మమత బెనర్జీ తొలిసారిగా కెబినెట పునర్యవ్యనస్థీకరించారు.

పాఠశాల నియామకాల కుంభకోణంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి పార్థా ఛటర్జీని మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత సీఎం మమత కేబినెట్ విస్తరణ చేపట్టారు. కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో గత ఏడాది బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. బల్లిగుంజె నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మంత్రిసుబ్రత ముఖర్జీ మరణించడంతో ఆ స్థానం నుంచి బాబుల్ సుప్రియో పోటీ చేసి గెలుపొందారు.

Show Full Article
Print Article
Next Story
More Stories