పెళ్లిళ్లు బ్రేక్‌ .. వారంలో ముగియనున్న సీజన్.. మళ్లీ మే మాసంలోనే‌

పెళ్లిళ్లు బ్రేక్‌ .. వారంలో ముగియనున్న సీజన్.. మళ్లీ మే మాసంలోనే‌
x
Highlights

ఈ ఏడాది పెళ్లి ముహూర్తాలు తక్కువేనని అంటున్నారు పండితులు.

కొత్త సంవత్సరం వచ్చింది. పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఉన్నారా? ఈ ఏడాది వారికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావిస్తున్నారా? అయితే కాస్త ఆగండి. ఈ ఏడాది పెళ్లి ముహూర్తాలు తక్కువేనని అంటున్నారు పండితులు. కోవిడ్‌–19 ప్రభావంతో పెళ్లిళ్లు బ్రేక్‌ పడితే మళ్లీ నెలల తరబడి సుముహూర్తాలు లేవనే అంశం పెళ్లిపీటలు ఎక్కబోయే వారిని నిరుత్సాహపరుస్తున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం

పెళ్లీడుకొచ్చి యువతీయువకులు ఉన్న తల్లిదండ్రులకు ఈ ఏడాది బ్యాడ్ న్యూస్ తీసుకొచ్చింది. ఈ సంవత్సం దాదాపు నాలుగు నెలల పాటు ముహుర్తాలు లేవని అంటూన్నారు పురోహితులు. గురు మౌఢ్యమితో పాటు శుక్ర మౌఢ్యమి సైతం వెంటనే రావడంతో పెళ్లి ముహూర్తాలకు కాస్త అడ్డంకిగా మారుతోంది. దీంతో మే నెల వరకూ మంచి ముహూర్తాలు లేవని అంటున్నారు. ఈ నెల 8వ తేదీ వరకే పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు ఉన్నాయని, ఇంకా చెప్పాలంటే 7వ తేదీనే చివరి మంచి ముహూర్తమంటూ సిద్ధాంతులు చెబుతున్నారు.

జనవరి నెల 14వ తేదీ నుంచి శూన్యమాసం ప్రారంభం కానుంది. ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 12 వరకూ అంటే సుమారు నెల రోజుల పాటు గురు మౌఢ్యమి ఉంటుందని అర్చక స్వాములు అంటున్నారు. ఈ ఏడాది మే 14న నుంచి పెళ్లిళ్ల సీజన్‌ మళ్లీ ప్రారంభం కానుంది. ఇది ఫిబ్రవరి 12 వరకూ కొనసాగనుంది. శూన్యమాసంలో శుభముహూర్తాలు ఉండవని అర్చకులు చెబుతున్నారు.

ఇక 80 రోజుల పాటు శుక్ర మాఢ్యమి ఉంటుందని అంటే.. ఫిబ్రవరి 14 మాఘ శుద్ధ తదియ నుంచి మే 4వ తేదీ బహుళ అష్టమి వరకూ ఉంటుందని సిద్ధాంతులు చెబుతున్నారు. అయితే మే నెలతో శుభ దినాలు ప్రారంభమైనప్పటికీ పది రోజులు పాటు అంత బలమైన ముహూర్తాలు లేవని అంటున్నారు. మే 14 నుంచి బలమైన ముహూర్తాలు ఉంటాయని వెల్లడించారు.

మే 14 తర్వాత మంచి కొద్దీ రోజులు మాత్రమే ముహుర్తాలు ఉన్నాయని అంటున్నారు. జూలై 4 నుంచి ఆషాఢమాసం ప్రారంభమై ఆగస్టు 11తో ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు చేసుకునేందుకు మంచి రోజులు కావని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories