Manki Baat: విపత్తులను ఎదుర్కొంటున్నాం.. అర్ధం చేసుకోండి..మోదీ

We Are Combating Calamities Sincerely...Modi
x

PM Narendra Modi:(File Image)

Highlights

Manki Baat: రేడియో కార్య‌క్ర‌మం మ‌న్ కీ బాత్‌లో ప్ర‌ధాని మోదీ ఈ రోజు ప్ర‌సంగించారు.

Manki Baat: కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. ఆయన దేశం ఎదుర్కొంటున్న విపత్తులు, వాటిని ప్రభుత్వం ఎదుర్కొంటున్న తీరు గురించి వివరించి, తామెంత కష్టపడుతున్నామో అర్ధం చేసుకోవాలన్నట్లే చెప్పారు. మన్ కీ బాత్ లో మాట్లాడిన మోదీ.. గత రెండు వారాల్లో వచ్చిన రెండు తుపాన్లు.. వాటిని ఎదుర్కొన్న తీరు గురించి చెప్పారు.

క‌రోనా, తుపాను బాధితుల‌కు అండ‌గా నిలుస్తున్నాం అని మోదీ చెప్పారు. తుపాను నేప‌థ్యంలో స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొని ల‌క్ష‌లాది మందికి సేవ‌లు అందించిన వారికి తాను సెల్యూట్ చేస్తున్నాన‌ని చెప్పారు. వారి సేవ‌లు అభినంద‌నీయ‌మ‌ని చెప్పారు. తుపాను ప్రభావిత రాష్ట్రాల్లోని ప్రజలు ధైర్యంగా ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం, రాష్ట్రాలు కలిసి పని చేశాయి. గతంలో కంటే తక్కువ ప్రాణనష్టం జరిగింది. సహాయక చర్యల్లో పాల్గొన్న వారి సేవ‌లు అభినంద‌నీయం. తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతున్నాను' అని మోదీ వ్యాఖ్యానించారు.

'సంక్షోభ ప‌రిస్థితుల్లో మ‌హిళ‌లు దేశానికి అందిస్తోన్న సేవ‌లు మ‌ర‌వ‌లేనివి. ఒక ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్‌ను మ‌హిళా సిబ్బంది న‌డిపారు. 'దూర ప్రాంతాలకు మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయటం క‌ష్టంగా మారింది. క్రయోజనిక్ ట్యాంకర్ డ్రైవర్ల శ్రమ ద్వారా లక్షల మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు. సాధారణ రోజుల్లో రోజువారీ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి 900 మెట్రిక్ టన్నులుగా ఉండేది. అది ఇప్పుడు పది రెట్లు పెరిగి దాదాపు 9,500 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతోంది' అని ప్ర‌ధాని మోదీ వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories