Viral Video: ఏకంగా ఫ్లైట్ బుక్ చేసుకుని ఆకాశంలోనే వివాహం

Viral Video: Madurai Couple Gets Married on Airoplane
x

Viral Video: ఏకంగా ఫ్లైట్ బుక్ చేసుకుని ఆకాశంలోనే వివాహం

Highlights

Viral Video: తమిళనాడులో ఓ వివాహం వివాదాస్పదంగా మారింది.

Viral Video: తమిళనాడులో ఓ వివాహం వివాదాస్పదంగా మారింది. కరోనా వేళ చాలా మంది పరిమిత సంఖ్యలో పెళ్లి చేసుకుంటున్న వేళ ఆ జంట మాత్రం ఆకాశంలో వివాహం చేసుకుంది. తమ పెళ్లి కోసం ఏకంగా విమానాన్నే బుక్ చేసుకున్నారు. స్పైస్ జెట్‌కు చెందిన ఈ విమానంలో బంధుమిత్రులతో కలిసి ఆ విమానంలో మధురై నుంచి బెంగళూరు వెళుతూ గాల్లోనే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నిన్న జరిగిన ఈ మొత్తం ఎపిసోడ్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అయింది. అదే సమయంలో వివాదాస్పదంగానూ మారింది. కరోనా వేళ జరిగిన ఈ పెళ్లిలో కరోనా మార్గదర్శకాల అమలు ఎక్కడా కనిపించలేదు. విమానంలో అతిథులు క్రిక్కిరిసి ఉండగా, వధూవరులకు మాస్కుల్లేకుండానే మాంగల్యధారణ జరిగింది. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

కరోనా నిబంధనలు పాటించకుండా ఇలాంటి కార్యక్రమాలు ఏంటని డీజీసీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ స్పైస్ జెట్, ఎయిర్ పోర్ట్ వర్గాలను ఆదేశించింది. ఆ విమానంలోని స్పైస్ జెట్ సిబ్బందిని విధుల నుంచి తప్పించారు. నిబంధనలు పాటించకుండా విమానం ఎక్కిన పెళ్లి బృందంపై ఫిర్యాదు చేయాలంటూ స్పైస్ జెట్ ను డీజీసీఏ ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories