Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేస్‎లో విజయ్ నాయర్ బెయిల్‎పై విచారణ

Vijay Nair Bail Inquiry In Delhi Liquor Case
x

 Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేస్‎లో విజయ్ నాయర్ బెయిల్‎పై విచారణ

Highlights

Delhi Liquor Scam: వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరైన విజయ్ నాయర్

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసులో విజయ్ నాయర్ బెయిల్‎పై సీబీఐ స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. లిక్కర్ పాలసీతో పాటు మనీ లాడరింగ్ కేసుల్లో జైల్లో ఉన్న విజయ్ నాయర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. విజయ్ నాయర్ అమ్ అద్మీ పార్టీలో మీడియా కోఆర్డినేటర్‎గా వ్యవహరిస్తున్నారు. లిక్కర్ పాలసీ తయారీలో, అమలు చేయడంలో విజయ్ నాయర్ కీలకంగా వ్యవహరించాడని ఈడీ తరఫు లాయర్ వాదించారు. లిక్కర్ పాలసీ తయారీలో విజయ్ నాయర్ అనేక మంది రాజకీయ నాయకులను కలిశారని 100 కోట్ల ముడుపులు మార్పిడిలో ఉన్నాడని కోర్టు దృష్టికి తెచ్చారు. లిక్కర్ పాలసీ సౌతంగ్రూప్‎కు అరు శాతం లాభం చేకూర్చేలా ఉందని ఆ సంస్థతో విజయ్ నాయర్‎కు సంబంధాలు ఉన్నాయని ఈడీ స్పష్టం చేసింది. అరుణ్ పిళ్లై ఇండో స్పిరిట్‎కు లిక్కర్ హోల్‎సేల్‎లో 65 శాతం వాటా ఉందని 600 కోట్లు సౌత్ గ్రూప్ అవంతిక ఆర్గానిక్, శరత్ చంద్రారెడ్డి పెట్టుబడి పెట్టారని తెలిపింది. విజయ్ నాయర్ 3 నెలల్లో 7 ఫోన్లు మార్చాడని సిగ్నల్, టెలిగ్రాం ద్వారా ఛాటింగ్, వాయిస్ కాల్స్ జరిగాయని ఈడీ తరఫు న్యాయవాది సీబీఐ స్పెషల్ కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న కోర్టు.. కేసు విచారణను జనవరి 20కి వాయిదా వేసింది. లిక్కర్ కేసులో సమీర్ మహేంద్ర బెయిల్ కేసులోనూ విచారణ జరిపిన సీబీఐ స్పెషల్ కోర్టు జనవరి 18కి వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories