Vijay: రాజకీయ తొలి ప్రసంగంతోనే తమిళనాడు ప్రజలను కట్టి పడేసిన విజయ్

Vijay: రాజకీయ తొలి ప్రసంగంతోనే తమిళనాడు ప్రజలను కట్టి పడేసిన విజయ్
x
Highlights

Vijay: దక్షిణాది రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న తమిళనాడులో కొత్త పార్టీ ఆవిర్భవించింది. ఇప్పటికే జాతీయ, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న ఈ...

Vijay: దక్షిణాది రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న తమిళనాడులో కొత్త పార్టీ ఆవిర్భవించింది. ఇప్పటికే జాతీయ, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న ఈ రాష్ట్రంలో వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు నటుడు విజయ్ దళపతి తమిళగ వెట్రి కళగం ( TVK) అనే పేరుతో పార్టీ పెట్టడమే కాదు ఆదివారం తొలి రాజకీయ సభను కూడా నిర్వహించిన సక్సెస్ అయ్యాడు.

విళుపురం జిల్లా విక్రవాండి సమీపంలోని వి.సాలైలో మహానాడు బహిరంగ సభ ద్వారా విజయ్ నిజంగా హీరో అనిపించుకున్నారు. తమిళనాడులో త్వరలోనే జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని..తప్పనిసరిగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇక ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు, ప్రభుత్వంపై పేరు ప్రస్తావించకుండా తనదైన రీతిలో సెటైరికల్ విమర్శలు గుప్పించారు.


సినిమా హీరోలకు రాజకీయాలు రావు..సినిమావాళ్ల రాజకీయాల్లో రాణించలేరు..వంటి పొలిటికల్ పార్టీలు చేసే విమర్శలను ఓ చిన్న కథగా చెప్పారు విజయ్. ముందుగా బహిరంగ సభ వేదికపైకి నడుచుకుంటూ వచ్చిన విజయ్ ని జనం కేకలతో హోరెత్తించారు.

మరికొందరు పార్టీ రంగులోని కండువాలను విసిరివేసి ఆయనకు సపోర్టు చేశారు. అందరి మధ్యలో చిరునవ్వులు చిందిస్తూ వచ్చిన విజయ్ చిన్న కథ చెబుతూ అందరి ద్రుష్టిని ఆకర్షించారు. వేదికపై విజయ్ చెప్పిన కథే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories