Freebies: ‘ఉచిత’ పథకాలపై ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ కీలక వ్యాఖ్యలు..

Vice President Dhankhar Key Comments On Free Schemes
x

Freebies: ‘ఉచిత’ పథకాలపై ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ కీలక వ్యాఖ్యలు..

Highlights

Freebies: ప్రస్తుత సమాజంలో ‘ఉచిత’ పథకాల పేరుతో జరుగుతున్న పోటాపోటీ రాజకీయాలపై ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Freebies: ప్రస్తుత సమాజంలో ‘ఉచిత’ పథకాల పేరుతో జరుగుతున్న పోటాపోటీ రాజకీయాలపై ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అలా చేయడం వ్యయ ప్రాధాన్యతలను మార్చుకోవడమే అవుతుందని పేర్కొన్నారు. జేబులకు భరోసా ఇవ్వడం కాదని.. ప్రజలను శక్తిమంతం చేయాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ‘భారత మండపం’లో ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

దీర్ఘకాలంలో దీని ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆరోగ్యకరమైన చర్చ జరగాల్సి ఉందన్నారు. భారత్‌ మాదిరిగా ప్రపంచంలో ఏ ప్రదేశమూ మానవ హక్కులతో విరాజిల్లడం లేదని స్పష్టం చేశారు. మానవ హక్కుల్లో ప్రపంచంలో ఏ భాగం కూడా భారత్‌ మాదిరిగా విరాజిల్లడం లేదని, మన నాగరికత, రాజ్యాంగ రూపకల్పన అనేవి మానవ హక్కులను గౌరవించడం, పరిరక్షించడం, పెంపొందించడంలో మన నిబద్ధతను చాటిచెబుతున్నాయని, ఇది మన డీఎన్‌ఏలోనే ఉందని జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories