Dr Rajagopala Chidambaram: ప్రముఖ అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం కన్నుమూత

Veteran Nuclear Scientist Rajagopala Chidambaram Dies at 88
x

Dr Rajagopala Chidambaram: ప్రముఖ అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం కన్నుమూత

Highlights

Dr Rajagopala Chidambaram: ప్రముఖ అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదరంబరం కన్నుమూశారు.

Dr Rajagopala Chidambaram: ప్రముఖ అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదరంబరం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని జస్లోక్ ఆస్పత్రిలో శనివారం తెల్లవారుజామున 3.20 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల శాస్త్రవేత్తలు, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రస్తుతం రాజగోపాల చిదంబరం వయస్సు 88 ఏళ్లు. పొఖ్రాన్ న్యూక్లియర్ పరీక్షల్లో ఆయన కీలక పాత్ర పోషించారు.

చెన్నైలో జన్మించిన రాజగోపాల చిదంబరం.. మద్రాసు యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో బీఎస్సీ పూర్తి చేశారు. 1962లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. 1975లో జరిపిన పోఖ్రాన్ 1, 1998లో నిర్వహింంచిన పోఖ్రాన్ 2 అణు పరీక్షల్లో కీలకంగా పనిచేశారు.

శాస్త్రవేత్తగా తన కెరీర్ ప్రారంభించిన డాక్టర్ చిదంబరం బాబా అటామిక్ రీసెర్చ్ డైరెక్టర్‌గా, అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్‌గా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కార్యదర్శిగా పనిచేశారు. 1994-95 సమయంలో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ గవర్నర్స్ బోర్డు చైర్మన్‌గా ఉన్నారు. డాక్టర్ చిదంబరం భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్‌గా కూడా పనిచేశారు. ఈ క్రమంలో అనేక అణు పరీక్షల సమయంలో తన సేవలను అందించారు. రాజగోపాల చిదంబరం సేవలను గుర్తించిన 1975లో పద్మశ్రీ, 1999లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories