చెవిదగ్గర గుసగుసలాడొద్దు : వెంకయ్య నాయుడు

చెవిదగ్గర గుసగుసలాడొద్దు : వెంకయ్య నాయుడు
x
Highlights

చెవిదగ్గర గుసగుసలాడొద్దు : వెంకయ్య నాయుడు. పరీక్షా హాలులో స్లిప్ అనుమతించబడదు, కానీ ఇక్కడ అనుమతి ఉంటుందని చమత్కయించారు. అలాగే సభ్యులెవ్వరూ..

కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. అయితే రాజ్యసభలో సబ్యులకు చైర్మన్ వెంకయ్యనాయుడు కీలక సూచనలు చేశారు. కరోనా రాకుండా ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు ఖచ్చితంగా అనుసరించాలని వెంకయ్య నాయుడు సభ్యులను కోరారు. ఎవరికి కేటాయించిన సీట్లలో వారే కూర్చువాలని.. ఎవరూ కూడా తమ స్థానాలను వదిలి వేరే చోటుకు వెళ్లోద్దని సూచించారు. దీంతోపాటు చెవిలో వంగి గుసగుసలాడవద్దని కూడా విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం మానుకోవాలని.. ఇతర సభ్యులతో ఏదైనా చెప్పాలనుకుంటే, దానిని స్లిప్ మీద రాసి ఇవ్వాలని..

పరీక్షా హాలులో స్లిప్ అనుమతించబడదు, కానీ ఇక్కడ అనుమతి ఉంటుందని చమత్కయించారు. అలాగే సభ్యులెవ్వరూ తన కార్యాలయానికి రావొద్దని సూచించారు. కలవాలని తనకూ ఉన్నా.. ప్రస్తుత పరిస్థితిలో, భద్రతా ప్రమాణాలను అనుసరించాలని అన్నారు. ఇదిలావుంటే ప్రస్తుతం రాజ్యసభ సమావేశాలు ఎన్నడూ లేని రీతిలో జరుగుతున్నాయి. కరోనా నియమాలను పాటించి సీటింగ్ ఆరెంజ్ చేశారు. అలాగే మాస్కులు తప్పనిసరి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories