varavara rao bail petition rejected: వరవరరావు బెయిల్ పిటిషన్‌‌ నిరాకరణ

varavara rao bail petition rejected: వరవరరావు బెయిల్ పిటిషన్‌‌ నిరాకరణ
x
Highlights

varavara rao bail petition rejected: విరసం(విప్లవ రచయితల సంఘం) నేత వరవరరావు బెయిల్‌ పిటిషన్‌ను ముంబై కోర్టు తిరస్కరించింది..

varavara rao's bail petition rejected: విరసం(విప్లవ రచయితల సంఘం) నేత వరవరరావు బెయిల్‌ పిటిషన్‌ను ముంబై కోర్టు తిరస్కరించింది.. కొన్నిరోజులుగా వరవరరావు అనారోగ్యంగా ఉన్నారని, దాంతో చికిత్స కోసం బెయిల్‌ ఇవ్వాలంటూ ఆయన తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ను కోర్టు ధర్మాసనం కొట్టి వేసింది. భీమా కోరేగావ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావు ఇందులో కీలక నిందితుడిగా ఉండటం చేత ఆయనకు బెయిల్‌ ఇవ్వొద్దని జాతీయ దర్యాప్తు సంస్థ (ఏన్‌ఐఏ) అభ్యంతరం తెలిపింది.

దీంతో కోర్టు ఈ పిటిషన్‌ను నిరాకరించింది. కాగా, ప్రధాని మోదీని హత్య చేసేందుకు మావోయిస్టుల కుట్రలో వరవరరావు పేరు ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. ఈ ఆపరేషన్‌కు నిధులు ఆయనే సమకూర్చినట్లు భావిస్తున్నారు. గతంలో వరవరరావుపై పుణె పోలీసులు కేసు నమోదుచేశారు. 2018 నవంబర్‌లో అరెస్టయిన వరవరరావును తొలుత మహారాష్ట్ర పుణేలోని ఎరవాడ జైలుకు తరలించారు.. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎరవాడ నుంచి నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు. అయితే వృద్ధుడైన తమ తండ్రిని జైలు నుంచి విడుదల చేయాలంటూ వరవరరావు కుమార్తెలు ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే ఆ రాష్ట్ర గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలకు లేఖలు రాశారు. అయితే ఈ లేఖలపై ఎటువంటి స్పందనా రాలేదు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories