Vande Bharat Express: వందేభారత్‌ హవా.. 100 శాతానికిపైగా ఆక్యుపెన్సీ

Vande Bharat Trains Record 100% Patronage
x

Vandebharat Express: వందేభారత్‌ హవా.. 100 శాతానికిపైగా ఆక్యుపెన్సీ

Highlights

Vande Bharat Express: రైళ్లకు ప్రయాణికుల నుంచి అపూర్వమైన ఆదరణ

Vande Bharat Express: వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు జోరుమీదున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు స్టేషన్ల నుంచి నడుస్తున్న నాలుగు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రయాణికుల నుంచి అపూర్వమైన ఆదరణ లభిస్తోంది. ఈ రైళ్లు గత నెలలో 100 శాతానికి మించి ఆక్యుపెన్సీతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. అనుకూలమైన, సురక్షితమైన ప్రయాణ సదుపాయాన్ని ఈ రైళ్లు కల్పిస్తున్నాయి. వీటిలో ఏసీ చైర్‌కార్‌, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉండటంతో ప్రయాణికులు ఆకర్షితులవుతున్నారు.

మరోవైపు ఈ రైళ్లలో జీపీఎస్‌ ఆధారిత ప్యాసింజర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్, కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు, ఎల్‌ఈడీ లైటింగ్‌, ప్రతి సీటు కింద చార్జింగ్‌ పాయింట్లు వంటి అనేక ప్రపంచస్థాయి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో వీటిలో ప్రయాణానికి ప్యాసెంజర్లు మొగ్గు చూపుతున్నారు. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నంకు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ గతేడాది జనవరిలో ప్రారంభమైంది. తొలిరోజు నుంచే 100 శాతం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీతో స్థిరంగా నడుస్తోంది. డిసెంబరులో సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నంకు వందేభారత్‌ ఆక్యుపెన్సీ 134శాతం ఉండగా, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు ఆక్యుపెన్సీ 143 శాతం ఉండడం విశేషం.

ఇక గతేడాది ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కూడా తొలిరోజు నుంచి పూర్తి ఆక్యుపెన్సీతో స్థిరంగా దూసుకెళ్తోంది. ప్రయాణికుల నుంచి అనూహ్యమైన స్పందన రావడంతో ఈ రైలుకు మే నుంచి కోచ్‌లను 8 నుంచి 16కు పెంచారు. గత డిసెంబరులో సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఆక్యుపెన్సీ 114శాతం, తిరుపతి- సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఆక్యుపెన్సీ 105శాతంగా ఉంది. కాగా గత సెప్టెంబరులో ప్రవేశపెట్టిన కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ మంచి ఆదరణను సొంతం చేసుకుంటోంది.

డిసెంబరులో ఈ రైలు ఆక్యుపెన్సీ 107 శాతం ఉండగా, తిరుగు ప్రయాణంలో ఆక్యుపెన్సీ 110 శాతంగా నమోదైంది. విజయవాడ నుంచి చెన్నై వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ గతేడాది సెప్టెంబరులో ప్రారంభమైంది. ఈ రైలు ఆక్యుపెన్సీ 128శాతంగా నమోదు కాగా, తిరుగు ప్రయాణంలో చెన్నై నుంచి విజయవాడకు ఆక్యుపెన్సీ 119శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలను తీర్చడమే ప్రధాన లక్ష్యమని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ అన్నారు.లు ఉన్నారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories