Uttar Pradesh Exit Polls 2022: రసవత్తర పోటీ జరిగిన ఉత్తర ప్రదేశ్ లో మళ్లీ కమలం....

Uttar Pradesh Exit Polls 2022 Saying that again BJP Won Assembly Elections 2022 | Live News
x

Uttar Pradesh Exit Polls 2022: రసవత్తర పోటీ జరిగిన ఉత్తర ప్రదేశ్ లో మళ్లీ కమలం....

Highlights

Uttar Pradesh Exit Polls 2022: దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో...

Uttar Pradesh Exit Polls 2022: దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడబోతున్నాయి. రసవత్తర పోటీ జరిగిన ఉత్తర ప్రదేశ్ లో మళ్లీ కమలం వికసిస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. మోడీ-యోగి డబుల్ ఇంజిన్ సర్కార్ కు మళ్లీ ప్రజామోదం లభిచంచడంతో ఇతర పార్టీలు హైరానా పడుతున్నాయి. అధికార పార్టీ బీజేపీతో సహా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాయి. బీజేపీకి 262 నుంచి 277 స్థానాలు దక్కుతాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. బీజేపీ ప్రధాన ప్రత్యర్ధి సమాజ్ వాది పార్టీ 35 శాతం ఓట్లను సాధిస్తుందని అంచనా వేస్తుండగా.. బీఎస్పీ 15 శాతం, కాంగ్రెస్ మూడు, ఇతరులు నాలుగు శాతం ఓట్లు సాధిస్తుందని చెబుతుండగా.. మూడు శాతం అటూ ఇటూ ఫలితాలు రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.

యూపీ ఎన్నికల బరిలో తాజా సీఎం యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్ పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. సీఎం అయిన తర్వాత 2017 సెప్టెంబర్ లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. మరో సంవత్సర కాలం ఎమ్మెల్సీ పదవీకాలం ఉంది. అయినా గోరఖ్ పూర్ నుంచి యోగి ఆదిత్యనాథ్ గెలుస్తారని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. సమాజ్ వాది పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా తొలిసారి అసెంబ్లీ ఎన్నికల భరీలో నిలిచారు. కర్హల్ స్థానం నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. అఖిలేష్ యాదవ్ గెలుపు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. అఖిలేష్ యాదవ్ పై కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ పోటీ చేస్తున్నారు. ఆగ్రా నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న బఘేల్ ఇక్కడ గెలుపు ఓటమికి పెద్దగా తేడా ఉండదని చెప్పుకోవచ్చు.

యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యా కౌశాంబి జిల్లా సిరథు స్థానం నుంచి పోటీ చేశారు. మౌర్య కూడా2017 ఎన్నికల్లో పోటీ చేయలేదు. డిప్యూటీ సీఎం అయ్యాక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆయన గెలుపుపై సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. రాంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన ఆజంఖాన్ సమాజ్ వాది పార్టీ నేతల్లోనే కాదు.. బీజేపీ నేతల మాటల్లోనూ ఆయన పేరు మార్మోగింది. ఆజంఖాన్ ప్రస్తుతం జైలులోఉన్నారు. ప్రస్తుతం రాంపూర్ ఎంపీగా కొనసాగుతున్నారు.

కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా చెప్పుకునే రాయ్ బరేలీ అసెంబ్లీ నుంచి బీజేపీ నేత అదితి సింగ్ మరోసారి ఎమ్మెల్యేగా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. 17వ అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ వయస్సు సభ్యురాలుగా ఎన్నికై రికార్డు సృష్టించింది అదితి సింగ్. మొదట కాంగ్రెస్ లో చేరిన అదితి.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై రాయ్ బరేలీ నుంచి విజయం సాధించి.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ బీజేపీతో సంబంధం కల్గి ఉందన్న ఆరోపణలతో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఈ ఎన్నికల్లో మరోసారి రాయ్ బరేలీ నుంచి తమ అధృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.

సుహెల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓంప్రకాశ్ రాజ్ బర్ జురాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. బీజేపీ ప్రభుత్వంలో చేరి కెబినెట్ మంత్రి పదవి పొందారు. 2019లో కూటమి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి మంత్రి పదవి పొగొట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో సమాజ్ వాద్ పార్టీ పొత్తుతో పోటీ చేస్తున్నారు.

సమాజ్ వాది పార్టీ వ్యవస్థాక సభ్యుడు, మాజీ మంత్రి శివపాల్ సింగ్ జస్వంత్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పార్టీలో విభేదాలకారణంగా 2018లో ప్రగతి శీలసమాజ్ వాదీ పార్టీ స్థాపించారు. 1996 నుంచి జస్వంత్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఎస్పీగుర్తపై జస్వంత్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు భీమ్ రాజ్ భర్ "మౌ" అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మహ్మద్ పూర్ బాబుపూర్ గ్రామానికి చెందిన భీమ్ రాజ్ 1980లో బీఎస్పీలో చేరారు. 2012 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

యూపీ నుంచి బరిలో ఉన్న ఇతర ప్రముఖల్లో బీజేపీ తరపున శ్రీకాంత్ శర్మ మధుర నుంచి, బేబీ రాణి మౌర్య ఆగ్రా రూరల్, సిద్దార్థ్ నాత్ సింగ్ అలహాబాద్ వెస్ట్ , నందగోపాల్ గుప్తా నంది అలహాబాద్ సౌత్, సమాజ్ వాది పార్టీ కి చెందిన అనురాంగ్ సింగ్ బాధౌరియా లక్నో ఈసట్, స్వామి ప్రసాద్ మౌర్య ఫాజిల్ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories