Minister Kamal Rani Varun Dies : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు... సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు
Minister Kamal Rani Varun Dies : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు... సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికి సోకి ప్రజలను మరింతగా భయబ్రాంతులకి గురి చేస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని క్యాబినెట్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి కమలా రాణి(62)ని కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఆమెకి జూలై 18న అనారోగ్యం పాలైయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ తరవాత లక్నో లోని సంజయ్ గాంధీ పోస్ట్-గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు.
ఆమె మృతి పట్ల సీఎం యోగి అధిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆమె అందించిన ప్రజా, సామాజిక సేవలను కొనియాడారు. మంత్రివర్గంలో ఆమె సమర్థవంతంగా పనిచేశారని పేర్కొన్నారుఆమె యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వంలో ఆమె సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇక ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కరోనాపై పోరులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ ముందున్నారు.
ఇక ఉత్తరప్రదేశ్ లో కూడా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం ఒక్కరోజే అక్కడ 47 మంది చనిపోయారు. దీంతో అటు మరణాల సంఖ్య 1,677కి చేరింది. అటు 24 గంటల్లో 3,587 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 89,048కి చేరుకుంది. ఇందులో 36,037 యాక్టివ్ కేసులు ఉండగా, 51,334 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
I express my deepest condolences to the family of Cabinet Minister Kamala Rani Varun. She was #COVID19 positive & was receiving treatment at SGPGI Hospital. She was a popular public leader & a social worker. She worked efficiently while being the part of the Cabinet:CM Adityanath pic.twitter.com/s4n5mnVRXq
— ANI UP (@ANINewsUP) August 2, 2020
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire