రాష్ట్రపతి ప్రసంగంపై ఉత్తమ్ విమర్శలు

రాష్ట్రపతి ప్రసంగంపై ఉత్తమ్ విమర్శలు
x
Highlights

ఈరోజు ఉదయం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేసిన ప్రసంగంపై నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగం చాలా...

ఈరోజు ఉదయం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేసిన ప్రసంగంపై నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగం చాలా పేలవంగా ఉందని, చాలా సమస్యలపై స్పష్టత లేదని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రపతి ప్రసంగంలో దేశంలో నిరుద్యోగ సమస్య గురించి, రైతుల సమస్య గురించి రాష్ట్రపతి మాట్లాడలేదని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగం మొత్తం బీజేపీ ప్రభుత్వాన్ని పొగడటానికే సరిపోయిందని ఎద్తేవా చేశారు. 2014 కంటే ముందు ప్రభుత్వాలు అస్థిరమైన ప్రభుత్వాలని రామ్ నాథ్‌తో అనిపించడం చాలా బాధాకరమని, యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలు కచ్చితంగా స్థిరమైనవి అన్న విషయాన్ని గుర్తించుకోవాలని ఉత్తమ్ సూచించారు. అలాగే మహిళా రిజర్వేషన్‌ ప్రస్తావనే లేదని అన్నారు. ప్రతిసంవత్సరం దేశంలో లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు దాని నివారణ చర్యల గురించి పట్టించుకోలేదని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories