US Elections: బైడెన్‌ ఎన్నికను ధృవీకరించే సమావేశాన్ని అడ్డుకున్న ట్రంప్‌ మద్దతుదారులు

US elections process
x

Trump supporters 

Highlights

US Elections:జో బైడెన్‌ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్‌ మద్ధతు దారులు ఆందోళనకు దిగారు. బైడెన్‌ ఎన్నికను ధృవీకరించే సమావేశాన్ని ట్రంప్‌ మద్దతుదారులు...

US Elections:జో బైడెన్‌ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్‌ మద్ధతు దారులు ఆందోళనకు దిగారు. బైడెన్‌ ఎన్నికను ధృవీకరించే సమావేశాన్ని ట్రంప్‌ మద్దతుదారులు అడ్డుకున్నారు. క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకెళ్లి కిటికీలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఘర్షణ వాతావరణంతో జో బైడెన్‌ గెలుపు ధృవీకరణ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. దీంతో వైట్‌హౌస్‌ భారీగా బలగాలను రంగంలోకి దింపింది.

ఈ నేపథ్యంలో డొనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్ చేశారు. అందరూ శాంతియుతంగా ఉండాలని తన మద్ధతుదారులు పోలీసులకు సహకరించాలని ట్రంప్‌ పిలుపునిచ్చారు. ట్రంప్‌ వీడియో సందేశాన్ని ఫేస్‌బుక్‌ తొలగించింది. ట్రంప్‌ మద్దతుదారుల ఆందోళన దృష్ట్యా వీడియో తొలగించామని వివరణ ఇచ్చింది ఫేస్‌బుక్‌ సంస్థ. ట్రంప్‌ ట్వీట్లను కూడా ట్విట్టర్‌ తొలగించింది. తమ నియమాలను ఉల్లంఘించేలా ట్వీట్లు ఉన్నాయని తెలిపింది. క్యాపిటల్ భవనం నుంచి వెళ్లిపోవాలంటూ చేసిన వీడియో కూడా తొలగించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories