కొంప ముంచిన ఫేస్ బుక్ ప్రేమ.. ప్రియురాలి కోసం వెళ్తే, కటకటాల్లోకి నెట్టేశారు. అసలేమైందంటే..?

కొంప ముంచిన ఫేస్ బుక్ ప్రేమ.. ప్రియురాలి కోసం వెళ్తే, కటకటాల్లోకి నెట్టేశారు. అసలేమైందంటే..?
x

కొంప ముంచిన ఫేస్ బుక్ ప్రేమ.. ప్రియురాలి కోసం వెళ్తే, కటకటాల్లోకి నెట్టేశారు. అసలేమైందంటే..?

Highlights

Facebook Love: ఫేస్‌బుక్‌లో పరిచయమైన స్నేహితురాలని కలుసుకునేందుకు ఒక భారతీయ యువకుడు అక్రమంగా పాకిస్తాన్‌లోకి ప్రవేశించాడు.

Facebook Love: ఫేస్‌బుక్‌లో పరిచయమైన స్నేహితురాలని కలుసుకునేందుకు ఒక భారతీయ యువకుడు అక్రమంగా పాకిస్తాన్‌లోకి ప్రవేశించాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ అతడిని పోలీసులు కటకటాల వెనుకకు నెట్టారు. ఆ మహిళను విచారించగా తనకు పెళ్లి ఇష్టం లేదని ఆ మహిళ స్థానిక పోలీసులకు తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాకు చెందిన బాదల్ బాబును డిసెంబర్ 28న పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని మండి బహౌద్దీన్ జిల్లాలో (లాహోర్‌కు 240 కి.మీ. దూరంలో) అరెస్టు చేశారు. 20 ఏళ్ల ఆ యువకుడిని తాను పెళ్లి చేసుకోవాలనుకున్న ఫేస్‌బుక్‌లోని స్నేహితురాలిని కలవడానికి సరిహద్దు దాటేశాడు.

ఫేస్‌బుక్‌లో బాధల్ బాబు స్నేహితురాలు సనా రాణి (21) వాంగ్మూలాన్ని పాకిస్తాన్ పోలీసులు నమోదు చేశారు. ఆమె తనను వివాహం చేసుకోవడానికి ఆసక్తి లేదని చెప్పింది. ‘‘బాబు, తాను గత రెండున్నరేళ్లుగా ఫేస్‌బుక్‌లో స్నేహితులమని, అయితే అతడిని పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి లేదని సనా రాణి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది’’ అని పంజాబ్ పోలీసు అధికారి నసీర్ షా తెలిపారు. గురువారం బాబు అక్రమంగా సరిహద్దులు దాటి మండి బహౌద్దీన్‌లోని సనా రాణికి చెందిన మాంగ్ గ్రామానికి చేరుకున్నారని అందుకే అధికారులు అరెస్టు చేశారని ఆయన చెప్పారు. బాబు రాణిని కలిశారా అని అడిగినప్పుడు, దానిని ధృవీకరించలేనని పోలీసు అధికారి చెప్పారు. బాబుతో ఆమెకు ఉన్న సంబంధాల గురించి పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు రాణితో పాటు ఆమె కుటుంబ సభ్యులను విచారించారని సమాచారం.

అరెస్ట్ అయిన తర్వాత బాబు తన ప్రేమ కథను పోలీసులకు వివరించాడు. ఎలాంటి చట్టపరమైన పత్రాలు లేకుండా ప్రయాణిస్తున్నందున బాబును పాకిస్తాన్ ఫారినర్స్ చట్టంలోని సెక్షన్ 13, 14 కింద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని కోర్టు ముందు హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. తదుపరి విచారణ జనవరి 10న జరుగనుంది.

అలీగఢ్ జిల్లాలోని బార్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిత్కారి గ్రామంలో నివసిస్తున్న బాబు తండ్రి కృపాల్ సింగ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. అతని అరెస్టు గురించి కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నారు. అతను ఢిల్లీలో పనిచేస్తున్నాడని మాకు తెలుసు, కాని మరుసటి క్షణం అతను పాకిస్తాన్లోని జైలులో ఉన్నాడని తెలిసి షాక్ అయ్యామని తెలిపాడు. బాధల్ బాబును విడుదల చేయించాలని భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి అతడి కుటుంబం విజ్ఞప్తి చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories