Yogi Adityanath: యోగి ఆదిత్యనాథ్‌కు బెదిరింపులు.. 10 రోజుల్లోగా సీఎం పదవికి రాజీనామా చేయకుంటే..

Yogi Adityanath: యోగి ఆదిత్యనాథ్‌కు బెదిరింపులు.. 10 రోజుల్లోగా సీఎం పదవికి రాజీనామా చేయకుంటే..
x
Highlights

యోగి ఆదిత్యనాథ్ మరో 10 రోజుల్లో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోతే ఆయనకు కూడా బాబా సిద్ధిఖికి పట్టిన గతే...

UP CM Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ గుర్తుతెలియని దుండగులు బెదిరింపు సందేశం పంపించారు. యోగి ఆదిత్యనాథ్ మరో 10 రోజుల్లో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోతే ఆయనకు కూడా బాబా సిద్ధిఖికి పట్టిన గతే పడుతుందని దుండగులు హెచ్చరించారు. ముంబైలోని ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నెంబర్ కి ఈ మెసేజ్ పంపించారు.

యోగి ఆదిత్యనాథ్‌పై బెదిరింపులకు పాల్పడుతూ వచ్చిన మెసేజ్ గురించి ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబైలోని వొర్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ డీజీపీకి కూడా పరిస్థితిని వివరించారు. మహారాష్ట్ర పోలీసుల నుండి సమాచారం అందుకున్న ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. వెంటనే సీఎం యోగి ఆదిత్యనాథ్ కు భద్రతను కట్టుదిట్టం చేశారు. యూపీ పోలీసులు కూడా ఈ బెదిరింపులపై తమ వైపు నుండి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగానే ఒక పోలీసు బృందం ముంబైకి బయల్దేరినట్లు తెలుస్తోంది.

ఇటీవల కాలంలో ముంబై ట్రాఫిక్ పోలీసు కంట్రోల్ రూమ్‌కి ఈ తరహా బెదిరింపులు రావడం ఇది నాలుగోసారి. ఇంతకంటే ముందు మూడుసార్లు ఇదే తరహాలో సల్మాన్ ఖాన్‌ని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. వారిలో ఇప్పటికే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు జంషెడ్‌పూర్‌కి చెందిన హుస్సేన్ షేక్ కాగా మరొకరు నొయిడా వాసి. ముంబై పోలీసులు ఈ ఇద్దరిపై స్థానిక కోర్టుల్లో ట్రాన్సిట్ ఆర్డర్ తీసుకుని ముంబైకి తరలించారు. నిందితులు ఉపయోగించిన మొబైల్ నెంబర్ ఆధారంగా పోలీసులు వారిని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఇక ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్‌కు బెదిరింపుల విషయంలోనూ ముంబై పోలీసులు అదే పని చేయనున్నారని తెలుస్తోంది. యోగి ఆదిత్యనాథ్ మరో 10 రోజుల్లో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోతే ఆయనకు కూడా బాబా సిద్ధిఖికి పట్టిన గతేయోగి ఆదిత్యనాథ్ మరో 10 రోజుల్లో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోతే ఆయనకు కూడా బాబా సిద్ధిఖికి పట్టిన గతే

Show Full Article
Print Article
Next Story
More Stories