Unlock: అన్ లాక్ పై రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

Unlock Should be Phase Wise Center
x
అన్ లాక్ ఇండియా (ఫైల్ ఇమేజ్)
Highlights

Unlock: ఒకేసారి అన్ లాక్ చేస్తే సడెన్‌గా కేసులు పెరిగి... థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉంటుందని కేంద్రం హెచ్చరించింది.

Unlock: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుదల కనిపించడంతో లాక్ డౌన్ ఎత్తి వేయాలని వస్తున్న డిమాండ్ల పై కేంద్రం స్పందించి కొత్త ఆదేశాలను జారీ చేసింది. ఆదేశ ప్రకారం ఒకేసారి రాష్ట్రమంతటా అన్‌లాక్ చెయ్యవద్దు అని, విడతల వారీగా అన్‌లాక్ చెయ్యాలని చెప్పింది. ఒకేసారి చేస్తే... సడెన్‌గా కేసులు పెరిగి... థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. అసలే సెకండ్ వేవ్‌ని ఇండియా సరిగా ఎదుర్కోలేకపోయిందనే విమర్శలు వస్తున్నాయి. అందువల్ల కనీసం థర్డ్ వేవ్ నైనా సమర్థంగా ఎదుర్కోవాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రమైనా ఏదైనా జిల్లాను అన్‌లాక్ చెయ్యాలంటే అక్కడ వారంలో పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువ ఉండాలని కేంద్రం చెప్పింది. అలా తక్కువగా ఉన్న జిల్లాల్లోనే అన్‌లాక్ చెయ్యాలని చెప్పింది. అలాగే... అక్కడ 45 ఏళ్లు దాటిన వాళ్లలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తై ఉండాలని చెప్పింది. అంతేకాదు... అక్కడి ప్రజలు స్వయంగా కరోనా రాకుండా అన్ని జాగ్రత్తలూ పాటిస్తూ ఉంటేనే అన్‌లాక్ చెయ్యాలని చెప్పింది.

"మెల్లమెల్లగా ఆంక్షలను తొలగిస్తూ పోతే కరోనా కేసులు పెరిగే అవకాశాలు తక్కువ. రాష్ట్రాలు వ్యాక్సినేషన్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి" అని భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ మంగళవారం అన్నారు. ఈయన భారత కోవిడ్ టాస్క్ ఫోర్స్‌లో సభ్యుడిగా ఉన్నారు.

"థర్డ్ వేవ్‌ని ఎదుర్కోవాలంటే పాటించాల్సినవి సింపుల్ విధానాలే. 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో మెల్లగా ఆంక్షలు తొలగించాలి. పెద్దవాళ్లలో 70 శాతం మందికి వ్యాక్సిన్ వేశాకే ఇలా చెయ్యాలి. వెయ్యకుండా ఆంక్షలు సడలించకూడదు" అని బలరామ్ భార్గవ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories