సినిమా హాళ్ళు తెరిచేందుకు కేంద్రం ఒకే.. స్కూల్స్ మాత్రం రాష్ట్రాల ఇష్టం!

సినిమా హాళ్ళు తెరిచేందుకు కేంద్రం ఒకే.. స్కూల్స్ మాత్రం రాష్ట్రాల ఇష్టం!
x
Highlights

Unlock 5.0 guidelines : సినిమా హాళ్ళు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. అక్టోబర్ 15 నుంచి కరోనా ఆంక్షల పై పలు సడలింపులు ప్రకటించింది కేంద్రం

కరోనా వైరస్ దెబ్బకు అన్ని వ్యవస్థలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లాక్ డౌన్ తరువాత మెల్ల మెల్లగా పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా ఆంక్షలు క్రమేపీ సడలిస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా అక్టోబర్ 15 నుంచి మరిన్ని ఆంక్షలు సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాటిలో ముఖ్యాంశాలు ఇవే..

కోవిడ్ ఆంక్షలు సడలిస్తూ కేంద్రం విడుదల చేసిన సరికొత్త మార్గదర్శకాలు

* పాఠశాలలు తెరిచే విషయంలో రాష్ట్రాలకే స్వేచ్ఛ

* కంటైన్మెంట్ జోన్లలో మరింత కఠినంగా ఆంక్షలు

* కంటైన్మెంట్ జోన్ల వెలుపల మరిన్ని సడలింపులు

* అక్టోబర్ 15 తర్వాత నుంచి ఆంక్షల సడలింపులు

* 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు తెరిచేందుకు అనుమతి

* క్రీడాకారులు ఉపయోగించే స్విమ్మింగ్ పూల్స్ తెరిచేందుకు అనుమతి

* ఎంటర్‌టైన్మెంట్ పార్కులు, ఆ తరహా ప్రదేశాలు తెరిచేందుకు సైతం అనుమతి

* తెరుచుకోనున్న అన్ని చోట్లా కఠినంగా కోవిడ్ జాగ్రత్తల అమలు

* అక్టోబర్ 15 తర్వాత దశలవారిగా విద్యాసంస్థలు తెరిచేందుకు రాష్ట్రాలకు వెసులుబాటు

* పాఠశాలల్లో కఠినంగా కోవిడ్ జాగ్రత్తల అమలు

* ఆన్‌లైన్ - దూరవిద్య విధానాల కొనసాగింపు

* ఆన్‌లైన్ తరగతులు కోరుకున్న విద్యార్థులకు కొనసాగించుకునే అవకాశం

* విద్య, క్రీడ, వినోద, సాంస్కృతిక, మత, ధార్మిక, రాజకీయ సభలు సమావేశాలకు 100 మంది వరకు ఇప్పటికే అనుమతి

* 100 మందికి మించి అనుమతించే విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ

* మూసి ఉన్న హాల్స్ లో 50% సీటింగ్ సామర్థ్యంతో గరిష్టంగా 200 మంది వరకే అనుమతి

* ఓపెన్ హాల్స్, బహిరంగ ప్రదేశాల్లో గ్రౌండ్ సామర్థ్యాన్ని బట్టి గరిష్ట సంఖ్య నిర్ణయం

* ఇప్పటికీ కొనసాగే ఆంక్షల్లో అంతర్జాతీయ విమానయానం

* కంటైన్మెంట్ జోన్లలో అక్టోబర్ 31 వరకు కఠిన లాక్‌డౌన్

* అంతర్రాష్ట్ర ప్రజా రవాణా, సరకు రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేవు

Show Full Article
Print Article
Next Story
More Stories