Unlock 2.0: నేటి నుంచి నెలాఖరు వరకు అన్ లాక్ 2.0 - అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు

Unlock 2.0: నేటి నుంచి నెలాఖరు వరకు అన్ లాక్ 2.0 - అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు
x
Highlights

Unlock 2.0: లాక్ డౌన్ పూర్తయ్యాక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ లాక్ 1.0 ఇప్పటికే పూర్తికాగా, అన్ లాక్ 2.0 నేటి నుంచి అమలు కాబోతుంది.

Unlock 2.0: లాక్ డౌన్ పూర్తయ్యాక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ లాక్ 1.0 ఇప్పటికే పూర్తికాగా, అన్ లాక్ 2.0 నేటి నుంచి అమలు కాబోతుంది. ఈ నిబంధనలు ఈ నెలాఖరు వరకు కొనసాగించాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

దేశంలో నేటి నుంచి అన్‌లాక్‌ 2.0 అమల్లోకి వచ్చింది. కంటైన్మెంట్‌ జోన్‌లలో ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. కంటైన్మెంట్‌ జోన్లలో అత్యవసర, నిత్యావసర సేవలు మినహా ఇతర అన్ని రకాల కార్యకలాపాలపై నిషేధం విధించారు.

విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుంది. మెట్రో రైల్‌, సినిమా హాళ్లు, జిమ్‌లు, స్మిమ్మింగ్‌ ఫూల్స్‌, సమావేశ మందిరాలు, వినోద పార్కులపై నిషేధం కొనసాగనుంది. రాజకీయ, ఆధ్యాత్మిక సభలు, సమావేశాలపైనా నిషేధం కొనసాగనుంది. మరోవైపు వివిధ రాష్ట్రాల స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల కూడా ఆంక్షలు విధించే స్వేచ్చ ఇచ్చింది కేంద్రం.

అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శిక్షణ సంస్థలు జులై 15 నుంచి ప్రారంభం అవుతాయి. దేశీయ విమాన సర్వీసులు, రైలు ప్రయాణాల్లో మరికొన్ని అదనపు సర్వీసులకు అనుమతి ఇచ్చారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories