Ram Vilas Paswan Passed Away : కేంద్రమంత్రి, లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) అధినేత రాంవిలాస్ పాశ్వాస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అయన కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు.
Ram Vilas Paswan Passed Away : కేంద్రమంత్రి, లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) అధినేత రాంవిలాస్ పాశ్వాస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అయన కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. ఇటివలే ఆయనకి గుండె సర్జరీ కూడా చేసుకున్నారు. ఆయన చనిపోయిన విషయాన్నీ అయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రాంవిలాస్ పాశ్వాస్ దాదాపుగా అయిదు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నారు. ఆయన మృతి పట్ల పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు..ప్రధాని మోడీ కూడా ఆయన మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుత రాం విలాస్ పాశ్వాస్‌వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిగా పనిచేస్తున్నారు.
I am saddened beyond words. There is a void in our nation that will perhaps never be filled. Shri Ram Vilas Paswan Ji's demise is a personal loss. I have lost a friend, valued colleague and someone who was extremely passionate to ensure every poor person leads a life of dignity. pic.twitter.com/2UUuPBjBrj
— Narendra Modi (@narendramodi) October 8, 2020
ఇక ఆయన రాజకీయ జీవితం విషయానికి వచ్చేసరికి బీహార్‌లోని ఖగారియాలో 1946 జూలై 5న జన్మించిన రాంవిలాస్ పాశ్వన్.. సోషలిస్టు పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించారు. ఎమర్జెన్సీ సమయంలో అరెస్టై 1977లో జనతా పార్టీ నుంచి లోక్‌సభలోకి తొలిసారి అడుగుపెట్టారు. 1980లో అలౌలి (ఖాగారియా) నియోజకవర్గం నుండి మొదటిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. 1977 లో హాజీపూర్ నియోజకవర్గం నుండి జనతా పార్టీ సభ్యుడిగా లోక్‌సభలో ప్రవేశించారు. 1980, 1989, 1996, 1998, 1999, 2004, , 2014 లో మళ్లీ పార్లమెంటు సభ్యునిగా ఎంపికయ్యాడు.
ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2000లొ లోక్ జనశక్తి పార్టీని స్థాపించి UPAలో చేరిన పాశ్వాన్ ప్రస్తుతం NDA కూటమిలో ఉన్నారు. 2010 నుండి 2014 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్న అయన తరువాత 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో హాజీపూర్ నియోజకవర్గం నుండి 16 వ లోక్‌సభ తిరిగి ఎన్నికయ్యారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire