PM Modi News: కేంద్ర ప్రభుత్వం తీపికబురు..వారి అకౌంట్లలోకి డబ్బులు

central Govt Gives rs.1500 To Transgenders
x

మోదీ పాత చిత్రం

Highlights

Transgenders: మోదీ స‌ర్కార్ మ‌రో గుడ్ న్యూస్ అందించింది.

Transgenders: మోదీ స‌ర్కార్ మ‌రో గుడ్ న్యూస్ అందించింది. అయితే ఇది అంద‌రికి కాదు. స‌మాజంలో వివ‌క్ష‌కు గువుతున్న హిజ్రాలకు మాత్ర‌మే ప్ర‌భుత్వం అందించే ప‌థ‌కం వ‌ర్తిస్తుంది. ఇంత‌కి ఎంటంటే..ట్రాన్స్‌జెండర్ సంక్షేమానికి నోడల్ మంత్రిత్వ శాఖగా ఉన్న సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ప్రతి ట్రాన్స్‌జెండర్‌కు ప్రాథమిక అవసరాల కోసం తక్షణ సహాయంగా రూ.1,500 జీవనాధార భత్యాన్ని అందించాలని నిర్ణయించింది. మే 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఆర్థిక సహాయం ట్రాన్స్‌జెండర్ సమాజానికి రోజువారీ అవసరాలను తీర్చడానికి సహాయపడుతుంది. ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్ వంటి వివరాలు అందించాలి. ట్రాన్స్‌జెండర్లు ఈ లింక్‌పై క్లిక్ చేసి డబ్బుల కోసం అప్లై చేసుకోవచ్చు. రూ.1500 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం పనిచేస్తున్న ఎన్జీఓలు, కమ్యూనిటీ-ఆధారిత సంస్థలు (సీబీఓ) ఈ ఆర్థిక సాయం గురించి ట్రాన్స్‌జెండర్లలో అవగాహన కల్పించాలని ప్రభుత్వం కోరింది. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది లాక్ డౌన్‌లో కూడా ఇలానే ఆర్థిక సాయం చేసింది. రేషన్ కిట్లను అందించింది. కరోనా కష్టకాలంలో ఇది వారికి ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యులు ప్రభుత్వ సహాయం కోరుతూ కాల్స్, ఈమెయిల్స్ చేసినట్లు కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories