కేంద్రం సంచలన నిర్ణయం.. ఆ రెండు చానెళ్ళ పై నిషేధం!

కేంద్రం సంచలన నిర్ణయం.. ఆ రెండు చానెళ్ళ పై నిషేధం!
x
Highlights

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు మళయాళ చానెళ్ళ పై 48 గంటల నిషేధం విధించింది. శుక్రవారం (06.03.2020) రాత్రి 7:30 గంటల నుంచి ఈ నిషధం...

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు మళయాళ చానెళ్ళ పై 48 గంటల నిషేధం విధించింది. శుక్రవారం (06.03.2020) రాత్రి 7:30 గంటల నుంచి ఈ నిషధం అమలులోకి వచ్చింది. పూర్తి వివరాలిలా ఉన్నాయి.

ఢిల్లీ అల్లర్లపై నిబంధనలకు విరుద్ధంగా ప్రసారాలు చేసినందుకు గాను, ఏషియా నెట్‌, మీడియా వన్‌ మళయాళ చానెళ్ల ప్రసారాలపై 48 గంటల నిషేధాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ విధించింది. ఈ రెండు చానళ్లు రెండు వర్గాల మధ్య విద్వేషాలు పెంచే విధంగా రిపోర్టింగ్‌ చేశాయని ఒక ప్రకటనలో పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రసారాలు చేసినందుకు గాను శుక్రవారం రాత్రి 7.30 గంటల నుంచి 48 గంటల పాటు ఆ రెండు చానళ్ల ప్రసారాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.

ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఫిబ్రవరి 23 న అల్లర్లు చేలరేగిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల పాటు సాగిన ఈ ఘర్షణల్లో 53 మంది మరణించగా.. 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపధ్యంలో పలు చానెళ్ళు మాట విద్వేషాలను రెచ్చగొట్టేలా కథనాలను ప్రసారం చేశారని సమాచార శాఖ చెబుతోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ అల్లర్ల కవరేజీకి సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని చానళ్ల ప్రసారాలను సమచార శాఖ నిశితంగా పరిశీలిస్తుట్లు పేర్కొంది. అయితే, ఈ నిర్ణయం పై కొందరు జర్నలిస్టులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories