కీలక నిర్ణయాలకు ఓకే చెప్పిన కేంద్ర కేబినెట్

కీలక నిర్ణయాలకు ఓకే చెప్పిన కేంద్ర కేబినెట్
x
Highlights

ప్రధాని మోడీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్రమంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఓకే చెప్పింది. ఆత్మ నిర్భర్ భారత్‌కు నిధుల కేటాయింపుతో పాటు పీఎం వాణి పథకానికి...

ప్రధాని మోడీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్రమంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఓకే చెప్పింది. ఆత్మ నిర్భర్ భారత్‌కు నిధుల కేటాయింపుతో పాటు పీఎం వాణి పథకానికి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ పరిణామాలతో నిరుద్యోగం బుసలు కొడుతోంది. ఇలాంటి సమయంలో ఉద్యోగ సృష్టే లక్ష్యంగా ఆత్మ నిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన పథకాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ స్కీమ్ అమలుకు 22వేల 810 కోట్లు కేటాయిస్తు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వెయ్యి 584 కోట్లు కేటాయిస్తూ మంత్రివర్గ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీ‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా పెద్దఎత్తున వైఫై నెట్‌వర్క్‌ విస్తరణకు ఉద్దేశించిన పీఎం వాణి పథకానికీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దేశంలో వైఫై విప్లవం తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కోటి డేటా సెంటర్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. వైఫై కోసం ఎలాంటి లైసెన్సులూ, రిజిస్ట్రేషన్లు ఉండబోవని చెప్పారు. దీంతో పాటు సముద్రం లోపల నుంచి సబ్‌మైరెన్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ ద్వారా లక్షద్వీప్‌లో హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ అందించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్ట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. ఇందుకోసం వెయ్యి 72 కోట్లు ఖర్చు చేయనున్నారు.

ఇక అటు ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోంలోని రెండు జిల్లాల్లో విస్తృత మొబైల్‌ కవరేజీకి ఉద్దేశించిన యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా 2వేల 374 గ్రామాలకు మొబైల్‌ కవరేజీ అందించనున్నారు. 2022 డిసెంబర్‌ నాటికి ఇది పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రం తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories