Union Budget 2022-23: నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్‌

Union Cabinet Approves 2022-23 Budget | National News Today
x

Union Budget 2022-23: 2022 - 23 బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం

Highlights

Union Budget 2022-23: మోడీ ప్రభుత్వం 10వ బడ్జెట్

Union Budget 2022: పారదర్శక సమీకృత అభివృద్ధికి ఈ బడ్జెట్‌ నాంది పలుకుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. వచ్చే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్‌ పునాది వేస్తుందన్నారు. యువత, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్‌ ఊతమివ్వబోతోందన్నారు. గృహ నిర్మాణం, వసతులు, తాగునీటి కల్పనలో దేశం వేగంగా ముందుకెళ్తోందన్నారు నిర్మలా సీతారామన్.

ఉత్పత్తి ఆధార ప్రోత్సాహకాలతో 14 రంగాల్లో మంచి అభివృద్ధి కనిపించిందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పాదకతకు తగిన ప్రోత్సాహకాలు కల్పించామన్నారు. నీలాంచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ను ప్రైవేటు పరం చేసినట్టు వెల్లడించారు. త్వరలో ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూకు రాబోతుందన్నారు.

ఈ బడ్జెట్‌లో ప్రధానంగా నాలుగు సూత్రాలకు ప్రాధాన్యమిచ్చినట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ప్రధాని గతిశక్తి యోజన, సమీకృత అభివృద్ధి, ఉత్పాధక అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు, పరిశ్రమలకు ఊతమివ్వనున్నట్టు స్పష్టం చేశారు.

ఇక వ్యవసాయ రంగానికి నిర్మలా సీతారామన్‌ పలు ప్రోత్సహకాలు ప్రకటించారు. చిరు ధాన్యాలు, రసాయన రహిత వ్యవసాయ అభివృద్ధికి, సేంద్రియ సాగుకు ప్రోత్సాహకాలను ఇస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంచేందుకు స్టార్టప్‌లకు ఆర్థిక సాయం కల్పిస్తామన్నారు. పీపీపీ పద్ధతిలో ఆహార శుధ్ధి పరిశ్రమలను ప్రోత్సహిస్తామన్నారు. ఇక నుంచి వంట నూనెలను దేశీయంగా ఉత్పత్తి చేస్తామని చెప్పారామె. 2023ను తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు నిర్మలా సీతారామన్.

దేశంలో నాలుగు చోట్ల మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కులను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. మల్టీ మోడల్‌ కనెక్టివిటీలో భఆగంగా రైల్వేలతో ఇతర రవాణా సదుపాయాలను అనుసంధానం చేస్తామన్నారు. ఇక పర్వత మాల ప్రాజెక్టులో భాగంగా పర్యావరణహితమైన అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నామన్నారు. ఈ ప్రాజెక్టు కిందే 8 రోప్‌వేలను నిర్మించనున్నట్టు మంత్రి వెల్లడించారు. కొండ ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి తగిన అవకాశాలను కల్పిస్తామన్నారు.

క్రెడిట్‌ గ్యారంటీ పథకానికి 2 లక్షల కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్టు తెలిపారు. పీఎం ఈ-విధ్య కార్యక్రమం కింద టెలివిజన్‌ ఛానళ్లు 12 నుంచి 200 వరకు పెంచుతున్నట్టు తెలిపారు. పీఎం ఆవాస్‌ యోజన కింద 80 లక్షల ఇళ్లను నిర్మించనున్నట్టు తెలిపారు. డిజిటల్‌ చెల్లింపులకు మరింత ప్రోత్సాహం ఇస్తామన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌.

లక్షన్నర పోస్టాఫీసుల ద్వారా ఆన్‌లైన్‌ బ్యాకింగ్, నెట్‌ బ్యాంకింగ్‌, ఏటీఎం సేవలు అందిస్తామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2022-23 లో ఈ-పాస్‌పోర్టుల జారీకి కొత్త సాంకేతికతను తీసుకొస్తున్నట్టు చెప్పారు. నగరాలు, పట్టణాల అభివృద్ధికి కొత్త పట్టణ ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. నగరాల్లో ప్రయాణాల సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామన్నారు. పట్టణాల్లో పర్యావరణ పరిరక్షణకు ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రోత్సాకాలను అందిస్తామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

దేశవ్యాప్తంగా ఏకీకృత రిజిస్ట్రేషన్‌ పథకం- ఎన్‌జీడీఆర్‌ఎస్‌ పథకాన్ని తీసుకొస్తున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి నిర్మల చెప్పారు. ఈ కొత్త పథకంతో దేశంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్‌ చేసుకునే వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. కాంట్రాక్టర్లకు ఈ-బిల్లులు పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. కాంట్రాక్టర్లకు ఈ-బిల్లులు పెట్టుకోవచ్ని తెలిపారు. బిల్లుల వివరాలను కూడా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో చూసుకునే సౌకర్యం కూడా అందుబాటులోకి వస్తుందన్నారు.

ఈ ఏడాదే 5జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి ప్రకటించారు. ప్రైవేటు సంస్థల ద్వారా 5జీ సాంకేతికతను ప్రవేశపెడుతున్నామన్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను భారత్‌ నెట్‌ ప్రాజెక్టు ద్వారా అందుబాటులోకి తెస్తామన్నారు. రక్షణ రంగంలో ప్రయివేటు సంస్థలకు అవకాశం ఇస్తామన్నారు. డీఆర్‌డీవో, ఇతర రక్షణ పరిశోధన సంస్థల భాగస్వామ్యంతో ప్రయివేటు సంస్థలకు అవకాశం కల్పిస్తున్నట్టు వివరించారు. రక్షణ ఉత్పత్తుల దిగుమతులు తగ్గించి.. దేశీయంగా అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు చెప్పారు.

అడవులను కూడా ప్రైవేట్‌కు అప్పగించనున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. గిరిజనుల కోసం అటవీ పెంపకానికి ప్రత్యేక పథకం తెస్తున్నట్టు చెప్పారు. దేశీయంగా సౌర విద్యుత్‌ ప్లేట్ల తయారీకి ప్రోత్సాహకాలను ప్రకటించారు. అందుకు 19వేల 500 కోట్లను కేటాయించారు. బొగ్గు ద్వారా గ్యాస్‌ ఉత్పత్తికి 4 పైలట్‌ ప్రాజెక్టులను తీసుకొస్తున్నామన్నారు.

2022-23 బడ్జెట్‌ను మొత్తం 39 లక్షల 45వేల కోట్ల రూపాయల అంచనాలతో రూపొందించినట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. దేశంలో ద్రవ్యలోటు 6.9 శాతం ఉన్నదని.. 2025-26 నాటికి దాన్ని 4.5 శాతానికి తగ్గించడమే ల‌క్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి చెప్పారు. ప్రస్తుతానికి 22 లక్షల 84వేల కోట్ల రూపాయల ఆదాయ వనరులు ఉన్నట్టు వెల్లడించారు.

రాష్ట్రాలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు లక్ష కోట్ల రూపాయల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. రాష్ట్రాలకు వడ్డీలేకుండా ఈ నిధులను ఇవ్వనున్నది. దేశవ్యాప్తంగా మూలధన పెట్టుబడుల కోసం ఈసారి కేంద్రం భారీగానే నిధులను కేటాయించింది. 10 లక్షల 68 వేల కోట్ల రూపాయలను కేటాయించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి తెలిపారు. ప్రభుత్వ, ప్రయివేటు రంగాలకు ఈ నిధులను కేటాయించనున్నట్టు స్పష్టం చేశారు.

రూపాయికి మరింత బలాన్ని చేకూర్చేలా డిజిటల్‌ రూపీని తీసుకొస్తున్నట్టు కేంద్ర మంత్రి నిర్మల తెలిపారు. ఆర్‌బీఐ ద్వారా సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీని తెస్తున్నట్టు తెలిపారు. దీంతో డిజిటల్‌ బ్యాంకింగ్ అభివృద్ధి చెందుతుందన్నారు. డిజిటల్‌ కరెన్సీ కోసం ఆర్‌బీఐ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందన్నారు. ఇక ప్రత్యేక ఆర్థిక మండళ్ల చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తెస్తామన్నారు. విద్యుత్‌ రంగానికి పునరుత్తేజ పరిచేందుకు ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఈ రంగంలో సంస్కరణల కోసం ప్రత్యేక ప్రణాళిక, నిధులను కేటాయిస్తామని మంత్రి చెప్పారు.

2022 జనవరిలో లక్షా 43వేల కోట్ల రూపాయలు వసూలైనట్టు మంత్రి తెలిపారు. జీఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇదే అత్యధిక ఆదాయమని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిందనడానికి ఇదే ఉదాహరణ అంటూ కేంద్రం మంత్రి స్పష్టం చేశారు. జీఎస్టీతో ఒకే దేశం.. ఒకే పన్ను అన్న కల నెరవేరిందన్నారు. జీఎస్టీలో సమస్యలు ఉన్నా.. ముందుకు సాగుతున్నామన్నారు. ఆదాయం బయటపెట్టని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోదాల్లో దొరికితే ఎలాంటి చట్టాల నుంచి మినహాయింపులు ఉండవని స్పస్టం చేశారు.

ఆదాయ పన్ను రిటర్న్‌ దాఖలను ఆధునీకరించామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రెండేళ్ల వరకు వ్యక్తిగత ఐటీ రిటర్న్‌ దాఖలకు అవకాశం కల్పించినట్టు మంత్రి చెప్పారు. సహకార సంస్థలకు కంపెనీలతో సమానంగా అల్టర్నేట్‌ పన్నును విధిస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ పన్నును 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌ను కట్‌ చేస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories