Union Budget 2021: బడ్జెట్ లైవ్ అప్‌డేట్స్.. కరోనా తర్వాత ప్రపంచం మారుతోంది
ఆర్ధిక మంత్రి నిర్మల లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. తొలిసారి పేపర్‌లెస్ ప్రవేశపెట్టారు. ట్యాబ్‌లో చూసి బడ్జెట్ చదువుతున్నారు.కరోనా తర్వాత ప్రపంచం...
ఆర్ధిక మంత్రి నిర్మల లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. తొలిసారి పేపర్‌లెస్ ప్రవేశపెట్టారు. ట్యాబ్‌లో చూసి బడ్జెట్ చదువుతున్నారు.
కరోనా తర్వాత ప్రపంచం మారుతోంది
ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియా మాదిరిగానే ఆర్థిక వ్యవస్థ మారుతోంది
ఆర్థిక వ్యవస్థ పునుర్జీవానికి బడ్జెట్‌లో ప్రత్యేక పేజీలు ఉన్నాయి
భారత ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్ ఊతమిస్తుంది
కరోనాపై యుద్ధం ఇప్పట్లో ఆగేది లేదు
ప్రపంచదేశానికి భారత్ ఆశాకిరణంలా కనిపిస్తోంది
విద్యుత్, వైద్యారోగ్యం, బ్యాంకింగ్, అగ్నిమాపక సిబ్బంది గొప్పగా పనిచేశారు
కరోనా తర్వాత ఇప్పుడు భారత్ కొత్తగా కనిపిస్తోంది
ఆత్మనిర్భర్ భారత్ ప్రపంచానికి ఆదర్శంగా మారింది
పీఎం ఆత్మ నిర్భర్ స్వస్థ్ యోజనకు శ్రీకారం
100 దేశాలకు టీకాలను సరఫరా చేస్తున్నాం
ఆరోగ్య రంగానికి 64.180 కోట్లతో ఆరోగ్య నిధి
64.180 కోట్లతో పీఎం ఆత్మ నిర్భర్ యోజన
నివారణ, చికిత్స సంపూర్ణ ఆరోగ్య విధానంలో పథకం
15 అత్యవసర ఆరోగ్ కేంద్రాలు
కొత్తగా 9 బీఎస్‌ఎల్ త్రీస్థాయి ప్రయోగశాలలు
87 వేల కోట్లతో 500 నగరాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు
పౌష్టికాహారం అందరికీ అందించేందుకు మిషన్ పోషణ్ 2.0
వ్యక్తిగత వాహనాలు 20 ఏళ్లు, కమర్షియల్ వాహనాలు 15 ఏళ్లు
ఐదు ట్రిలియన్ వృద్ధి సాధించాలంటే నిర్మాణరంగం పుంజుకోవాలి
కాలం తీరిన పథకాలకు తుక్కు కిందికి మార్చే పథకం
ఆరోగ్యవంతమైన దేశం కోసం అందరం శ్రమించాలి
ఆరు మూల స్థంభాల మీద బడ్జెట్ రూపకల్పన
అందులో ప్రధానమైనది ఆరోగ్య రంగం
కరోనా వ్యాక్సిన్ కోసం 35 వేల కోట్లు
అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తాం
ఆరోగ్య సంరక్షణకు 2 లక్షల కోట్లు
ఈసారి ఆరోగ్య రంగానికి 137% నిధులు కేటాయింపు
త్వరలోనే మెగా టెక్స్‌టైల్స్ పార్క్
వ్యవసాయ ఆదాయాలను రెట్టింపు చేసే పథకాలు
కొత్తగా ఈసారి నగర్ స్వచ్ఛ్ భారత్ మిషన్
దేశంలోని నాలుగు ప్రాంతాల్లో వైరాలజీ ల్యాబ్‌లు
మూడేళ్లలలో 7 టెక్స్‌టైల్ పార్క్‌ల ఏర్పాటు
కొత్తగా ఇన్నోవేషన్ అండ్ ఆర్‌అండ్‌డీ సెంటర్లు
కొత్తగా 17 వేల రూరల్, అర్బన్ హెల్ కేర్ సెంటర్లు
మరిన్ని పరిశ్రమలను ఆకర్షించేందుకు ప్రత్యేక పథకాలు
జల్ జీవన్ మిషన్‌కు 2.87 లక్షల కోట్లు
వాయు కాలుష్యం నివారణకు 2.217 కోట్లు
వెస్ట్‌బెంగాల్‌లో రహదారుల అభివృద్ధికి 25 వేల కోట్లు
జాతీయ రహదారుల కారిడార్ల అభివృద్ధికి రూ.1,18,101 కోట్లు
కేపిటల్ వ్యయం 5.54 లక్షల కోట్లు
రోడ్లు, రైల్వేలు, విమానరంగంపై ప్రత్యేక దృష్టి
2022కల్లా కొత్తగా 8 వేల జాతీయ రహదారులు
విజయవాడ-ఖరగ్‌పూర్ మధ్య రైల్వే లైన్ల అభివృద్ధి
అసోం, కేరళ, ప.బెంగాల్‌లో జాతీయ రహదారుల అభివృద్ధి
5 ప్రత్యేక రహదారుల అభివృద్ధికి రూ.5 వేల కోట్లు
తమిళనాడులో రోడ్ల అభివృద్ధికి రూ. లక్ష కోట్లు
బస్ ట్రాన్స్‌పోర్ట్ అభివృద్ధికి రూ.18 వేల కోట్లు
1,18 వేల కి.మీ. మేర రైల్వే లైన్ల అభివృద్ధి
బెంగళూరు-నాగ్‌పూర్ మెట్రో ఫేజ్-2కి నిధులు కేటాయింపు
మెట్రో నిర్వహణ తగ్గించేందుకు రెండు ప్రత్యేక సర్వీసులు
ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు, కేరళ, ప.బెంగాల్‌పై వరాలు
2023 కల్లా బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్లు విద్యుద్దీకరణ
మెట్రోలైట్, మెట్రో న్యూ పేరుతో కొత్త ప్రాజెక్టులు
బెంగళూరు మెట్రో అభివృద్ధికి రూ.14,788 కోట్లు
విద్యుత్ రంగానికి 3.05 లక్షల కోట్లు
ఉజ్వల స్కీమ్ కింద 9 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు
భారతీయ రైల్వేలకు 1.15 లక్షల కోట్లు
జమ్మూకశ్మీర్‌లో కొత్తగా గ్యాస్ పైప్‌లైన్ల ఏర్పాటు
పీపీపీ ద్వారా 2.200 కోట్లతో 7 కొత్త ప్రాజెక్టులు
కేరళలో రూ.65 వేల కోట్లతో అభివృద్ధి పనులు
వచ్చే 3ఏళ్లలో అన్ని జిల్లాలకు వంద శాతం గ్యాస్ పైప్‌లైన్లు
కొచ్చి, నాగ్‌పూర్, బెంగళూరులో మెట్రో విస్తరణకు ప్రత్యేక నిధులు
చెన్నై మెట్రోకు రూ.63వేల కోట్లు
ఇండియన్ షిప్పింగ్ కంపెనీకి రూ.1624 కోట్లు
నౌకల రీసైక్లింగ్ సామర్థ్యం పెంచేందుకు నిధులు
ఖరగ్‌పూర్-విజయవాడ మధ్య ఈస్ట్-కోస్ట్ సరకు రవాణా కారిడార్
చెన్నై మెట్రోకు రూ.63,246కోట్లు
కొచ్చి మెట్రో రెండో దశకు కేంద్రం సాయం
మరో కోటి మందికి ఉజ్వల పథకం
రాష్ట్రాలు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థల అభివృద్దికి రూ.2లక్షల కోట్లు
డిపాజిట్లపై బీమా పెంపు.. రెగ్యులేటర్ గోల్డ్ ఎక్స్ఛేంజీల ఏర్పాటు
ఇన్వెస్టర్ చార్టర్ ద్వారా ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ
బీమారంగంలో ఎఫ్‌డీఐలు 49 శాతం నుంచి 74శాతానికి పెంపు
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థలో సంస్కరణలు. డిపాజిట్లపై బీమా పెంపు
భారీగా విదేశీ పెట్టుబడులకు అవకాశాలు
బీమారంగంలో ఎఫ్‌డీఐలు 49- 74 శాతానికి పెంపు
ఇన్సూరెన్స్ రంగంలో భారీ మార్పులు, సంస్కరణలు
రైల్వే మౌలిక సౌకర్యాలకు 1,01,005 కోట్లు
అసోంలో రూ.19 వేల కోట్లతో అభివృద్ధి పనులు
ఎల్‌ఐసీ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ
2021-22లో పవన్ హన్స్, ఎయిరిండియా ప్రైవేటీకరణ
బ్యాంకుల నిరర్థక ఆస్తులపై కీలక నిర్ణయం
మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు
స్టార్టప్‌లకు 128 రోజుల్లోనే అనుమతి
వ్యవసాయ ఉత్పత్తుల్లో భారీ పెరుగుదల ఉంది
వ్యవసాయ రంగానికి రూ.1,72,750 కోట్లు
వరికి కనీస మద్దతు ధర రెట్టింపు
పలు సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం
గెయిల్, ఐఓసీ, హెచ్‌పీసీఎల్ పైపులైన్లలో పెట్టుబడుల ఉపసంహరణ
స్టార్టప్‌లకు చేయూత కోసం ఏకసభ్య కంపెనీలకు మరింత ఊతం
ఎంఎస్‌ఎంసీ 3.0. ప్రభుత్వ పింఛన్లు పెట్టుబడుల ఉపసంహరణ వేగవంతం
సవరణల అనంతరం ఎల్‌ఐసీ ఐపీవో విడుదల
పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1,75,000 కోట్లు
గ్రామీణాభివృద్ధికి రూ.40 వేల కోట్లు
రైతుల రుణాల లక్ష్యం రూ.16.5 లక్షల కోట్లు
సౌరశక్తి రంగానికి రూ. వెయ్యి కోట్లు
32 రాష్ట్రాల్లో వన్ నేషన్ వన్ రేషన్
కొత్తగా 100 సైనిక్ పాఠశాలలకు పచ్చజెండా
కొత్తగా హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు
ఎన్‌ఈపీ ద్వారా 15 వేల పాఠశాలల్లో మౌలిక వసతులు
లేహ్, లడక్‌లో కొత్తగా సెంట్రల్ యూనివర్సిటీ
గిరిజన ప్రాంతాల్లో రెసిడెన్షియల్ స్కూళ్లు
పరిశోధనా, నాణ్యత, మెరుగుదల కోసం జపాన్‌తో ఒప్పందం
హైడ్రోజన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి
గోవా డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు రూ.300 కోట్లు
9.5 శాతం జీడీపీ అంచనాలతో వృద్ధి రేటు
6.8 జీడీపీ వృద్ధిరేటుపై అంచనాలు
త్వరలోనే నర్సింగ్ కమిషన్ బిల్లు
2021లో మానవరహిత గగన్‌యాన్ ప్రయోగం
గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా...
నలుగురు భారతీయ హ్యోమగాములకు రష్యాలో శిక్షణ
స్కిల్ డెవలప్‌మెంట్‌కు రూ.3 వేల కోట్లు
భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రత్యేక పోర్టల్
ఎఫ్‌ఆర్‌బీఎం బిల్లుకు చట్ట సవరణలు
75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఊరట
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు
పన్ను చెల్లింపు ప్రక్రియకు మరిన్ని మినహాయింపులు
డైరెక్ట్ ట్యాక్స్ విధానంలో మార్పులు
మధ్యతరగతి ఉద్యోగులకు భారీ ఊరట
ఆదాయం పన్ను తగ్గించిన ఆర్థిక మంత్రి
కరోనా కష్టకాలంలో ఉద్యోగులకు అండగా ఉండే నిర్ణయం
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire