Coronavirus: దూసుకువస్తున్న కొత్త వేరియెంట్‌ రకాలు.. ఉత్తరాధి రాష్ట్రాల్లో అధికంగా యూకే రకం ప్రభావం

UK variant dominates north India; NCDC chief
x

Coronavirus: దూసుకువస్తున్న కొత్త వేరియెంట్‌ రకాలు.. ఉత్తరాధి రాష్ట్రాల్లో అధికంగా యూకే రకం ప్రభావం

Highlights

Coronavirus: కరోనా సెకండ్‌ వేవ్‌తో భారత్‌ అల్లాడిపోతుంది. ఇలాంటి సమయంలో కొత్త వెరియంట్‌లు కూడా అటాక్‌ చేసేందుకు దూసుకువస్తున్నాయి.

Coronavirus: కరోనా సెకండ్‌ వేవ్‌తో భారత్‌ అల్లాడిపోతుంది. ఇలాంటి సమయంలో కొత్త వెరియంట్‌లు కూడా అటాక్‌ చేసేందుకు దూసుకువస్తున్నాయి. కొత్తరకం కరోనా ప్రభావం తెలుసుకునేందుకు కేంద్రం ఎప్పటికప్పుడు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపడుతోంది. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో యూకే రకం ప్రభావం అధికంగా ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లో డబుల్‌ మ్యుటెంట్‌ రకం ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం వెల్లడించింది.

భారత్‌లో యూకే రకం ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ గత నెలన్నర నుంచి వీటి విస్తృతి తగ్గుతున్నట్లు ఎన్‌సీడీసీ డైరెక్టర్‌ సుజీత్‌ సింగ్‌ వెల్లడించారు. మరోవైపు కొత్త వేరియంట్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాలకు పంపిస్తున్నామని ఎన్‌సీడీసీ చీఫ్‌ తెలిపారు.

డబుల్‌ మ్యుటెంట్‌ వైరస్‌ ప్రభావం మాత్రం మహారాష్ట్రలో అధికంగా ఉందని ఎన్‌సీడీసీ వెల్లడించింది. మహారాష్ట్ర తర్వాత పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ, గుజరాత్‌ రాష్ట్రాల్లో సైతం డబుల్‌ మ్యుటెంట్‌ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు తెలిపింది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త రకం కరోనా ప్రభావం తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాల్లో కనిపించిందని ఎన్‌సీడీసీ వెల్లడించింది. ఇక బ్రెజిల్‌ రకం మాత్రం మహారాష్ట్రలో స్వల్పంగానే ఉన్నట్లు ఎన్‌సీడీసీ తెలిపింది.

కొత్త రకం కరోనా వెలుగుచూస్తోన్న వేళ రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎన్‌సీడీసీ చీఫ్‌ హెచ్చరించారు. వీటి ప్రభావం ఉన్న జిల్లాల్లో కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ భారీ స్థాయిలో చేపట్టాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి శాంపిళ్లకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టాలను సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories