జమ్మూ కాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల ఏరివేత.. ఆపరేషన్ కంటిన్యూ..

జమ్మూ కాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల ఏరివేత.. ఆపరేషన్ కంటిన్యూ..
x
Highlights

జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో బుధవారం భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఓ..

జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో బుధవారం భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. జిల్లాలోని చకురా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఆ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని చెప్పారు. అయితే భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన తరువాత ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని అన్నారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని స్పష్టం చేశారు.

ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పారు. హతమైన ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందినవారో నిర్ధారించలేదు. గత పది రోజులుగా, జమ్మూ కాశ్మీర్ లోయలో జవాన్లు జరిపిన నాలుగు ఆపరేషన్లలో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.. ఒక ఉగ్రవాది కూడా లొంగిపోయారు. లొంగిపోయిన ఉగ్రవాది దోడా నివాసిగా గుర్తించారు. ప్రస్తుతం అతని నుంచి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్టు జమ్మూ కాశ్మీర్ డిజిపి దిల్‌బాగ్ సింగ్ తెలిపారు.

అలాగే లష్కర్-ఎ-తోయిబా కమాండర్ సైఫుల్లాను కూడా రెండు రోజుల క్రితం జవాన్లు హతమార్చారు. పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా మూడు ఉగ్రవాద దాడులకు పాల్పడ్డాడు. ఇందులో ముగ్గురు సిఆర్‌పిఎఫ్ జవాన్లు అమరవీరులయ్యారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 75 విజయవంతమైన కార్యకలాపాలు జరిగాయి, ఇందులో 180 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు నిర్మూలించాయి. విడిగా, 138 మంది ఉగ్రవాదులు, వారి సహచరులను అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఏడాది జవాన్లు నిర్వహించిన విజయవంతమైన కార్యకలాపాలు రికార్డు సృష్టించాయని డిజిపి దిల్‌బాగ్ సింగ్ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories