Two Sisters: కారుతో అక్కాచెల్లెళ్ల బీభత్సం.. నానా తిప్పలు పడి ఛేజ్ చేసి మరీ పట్టుకున్న పోలీసులు

Two Sisters: కారుతో అక్కాచెల్లెళ్ల బీభత్సం.. నానా తిప్పలు పడి ఛేజ్ చేసి మరీ పట్టుకున్న పోలీసులు
x
Highlights

Two sisters blow their car horn non-stop and rams car into neighbours in Delhi: ఇద్దరు అన్నాదమ్ముళ్లు రౌడీల్లా ప్రవర్తించడం, వాళ్లు నివాసం ఉండే...

Two sisters blow their car horn non-stop and rams car into neighbours in Delhi: ఇద్దరు అన్నాదమ్ముళ్లు రౌడీల్లా ప్రవర్తించడం, వాళ్లు నివాసం ఉండే సొసైటీలో, కాలనీలో ఎదుటివారిపై దాడికి పాల్పడటం వంటి దృశ్యాలు సినిమాల్లో చూసే ఉంటారు. ఇదేంటని ప్రశ్నించిన వారిని చితక్కొట్టడం, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వాళ్ల అరాచకం ఆపకపోవడం వంటి సీన్స్ కూడా తరచుగా సినిమాల్లో చూసేవే. కానీ రియల్ లైఫ్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు అలా తమ ఇష్టారాజ్యానికి ప్రవర్తించడం ఎప్పుడైనా చూశారా? చూడకపోతే ఇదిగో ఈ క్రైమ్ స్టోరీ అలాంటిదే. అలాంటిది కాదు.. నూటికి నూరుపాళ్లు అదే అంటున్నారు ఆ రౌడీ సిస్టర్స్ అరాచకాన్ని తమ కళ్లారా చూసిన వాళ్లు. రౌడీ సిస్టర్స్ అనే పేరు కూడా వాళ్ల అరాచకాలు చూడలేక ఆ అపార్ట్‌మెంట్ వాసులు పెట్టుకున్న పేరే.

ఎక్కడ జరిగిందీ ఘటన:

అది ఈస్ట్ ఢిల్లీలోని వసుంధర ఎన్‌క్లేవ్. ఆ ఇద్దరు సిస్టర్స్ పేర్లు భవ్య జైన్, చార్వి జైన్. వారిలో పెద్దమ్మాయి వయస్సు 23 ఏళ్లు కాగా చిన్నమ్మాయి చార్వి వయస్సు 21 ఏళ్లు. వాళ్ల వయస్సు చిన్నదే అయినప్పటికీ వాళ్లు చేసే అరాచకాలు మాత్రం చాలా పెద్దవి అని చెబుతున్నారు వాళ్ల అపార్ట్‌మెంట్ వాసులు.

ఎన్డీటీవీ కథనం ప్రకారం శుక్రవారం రాత్రి ఈ ఇద్దరు సిస్టర్స్ పెద్ద సీన్ క్రియేట్ చేశారు. రాత్రి వేళ నాన్‌స్టాప్‌గా కారు హారన్ కొడుతూ న్యూసెన్స్ క్రియేట్ చేశారు. అది చూసి తట్టుకోలేక ఒక 70 ఏళ్ల వయస్సున్న అశోక్ శర్మ అనే రిటైర్డ్ పోలీసు ఆఫీసర్ వెళ్లి హారన్ కొట్టడం ఆపమన్నారు. మమ్మల్నే ఆపుతావా అంటూ ఆయన ఇంటికెళ్లి కత్తి తీసుకుని బెదిరించారు. ఇంట్లో పూల కుండీలు పగలగొట్టి నానా హంగామా చేశారు. దాంతో అశోక్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు అపార్ట్‌మెంట్ వద్దకు వచ్చేటప్పటికీ భవ్య జైన్, చార్వి జైన్ ఇద్దరూ తమ ఇంటికి వెళ్లి లోపలి నుండి తాళం వేసుకున్నారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా వాళ్లు తలుపు తెరవలేదు. పైగా తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ లోపలి నుండే అశోక్ శర్మను బెదిరించసాగారు. దాదాపు 5 గంటల పాటు అపార్ట్‌మెంట్ వద్ద ఈ హైడ్రామా కొనసాగింది.

5 గంటల తరువాత ఇంట్లోంచి బయటికి వచ్చిన ఇద్దరు సిస్టర్స్ వెంటనే తమ కారు తీసుకుని అపార్ట్‌మెంట్ ఆవరణలోనే ర్యాష్ డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇష్టం వచ్చినట్లు దూసుకుపోతూ, ఎదురొచ్చిన వారిని ఢీకొంటూ బీభత్సం సృష్టించారు. పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను ఢీకొట్టారు. ఇదంతా కూడా పోలీసుల కళ్లెదుటే జరిగింది. పోలీసులు ఆపేందుకు ఎంత ప్రయత్నించినా ఈ సిస్టర్స్ వారి మాట కూడా వినలేదు. అక్కాచెల్లెళ్ల విధ్వంసం అంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.

అపార్ట్‌మెంట్‌లో విధ్వంసం సృష్టించిన తరువాత అంతే వేగంతో వెళ్లి అపార్ట్‌మెంట్ గేటు వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్‌ని ఢీకొట్టారు. అక్కడి నుండి పారిపోయి రోడ్డెక్కిన తరువాత కూడా ఆ విధ్వంసాన్ని కొనసాగించారు. అపార్ట్‌మెంట్ బయట జోగిందర్ అనే ఒక స్కూటరిస్టుని ఢీకొట్టి అతడి స్కూటర్‌ని కొన్ని మీటర్ల వరకు ఈడ్చుకెళ్లారు. అదృష్టవశాత్తుగా జోగిందర్ ఈ దాడి నుండి ప్రాణాలతో బయటపడ్డారు.

ఈస్ట్ ఢిల్లీ నుండి నొయిడా వైపు తమ కారులో వేగంగా పరుగులు తీస్తోన్న అక్కాచెల్లెళ్లను పట్టుకునేందుకు పోలీసులు ఆ వెనుకాలే ఛేజింగ్ చేయకతప్పలేదు. చూడ్డానికి అచ్చం సినిమాటిక్ సీన్‌ని తలపించిన ఈ ఛేజింగ్ సీన్‌లో నొయిడా సెక్టార్ 20 వద్ద అక్కాచెల్లెళ్ల కారుకు పోలీసులు బ్రేక్ వేశారు.

అపార్ట్‌మెంట్‌లో అక్కాచెల్లెళ్ల ర్యాష్ డ్రైవింగ్‌లో అపార్ట్‌మెంట్ ఎలక్ట్రిషియన్ ప్రదీప్ చౌరాసియాకు గాయాలయ్యాయి. అంతకంటే ముందు ఓసారి తనపై దాడికి పాల్పడ్డారని సెక్యురిటీ గార్డ్ అఖిలేష్ కుమార్ వాపోయారు. అపార్ట్‌మెంట్‌లో వీళ్ల ఆగడల గురించి తాను వాళ్ల నాన్నకు చెబుతున్నాను అనేది ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ల అనుమానం. అందుకే ఒకసారి ఫ్లాట్‌లో నల్లా మరమ్మతు చేసేందుకు రమ్మని పిలిచారు. తాను వెళ్లలేదు. ప్లంబర్‌ని పంపిస్తానని చెప్పాను. కానీ వాళ్లు నన్నే రమ్మని బలవంతం చేశారు. తీరా ఇంట్లోకి వెళ్లాకా ఇద్దరూ కలిసి దాడి చేశారు అని అఖిలేష్ బోరుమన్నారు.

కుటుంబ నేపథ్యం ఏంటి?

ఈ అక్కాచెల్లెళ్ల ప్రవర్తన గురించి తెలిశాక ఎవ్వరికైనా ముందుగా వచ్చే డౌట్ వీళ్ల కుటుంబ నేపథ్యం ఏంటి? అమ్మానాన్న ఏం చేస్తారు అనే సందేహం వస్తుంది. ఇక భవ్య జైన్, చార్వి జైన్ కుటుంబనేపథ్యం విషయానికొస్తే.. తల్లి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆమెకు దగ్గర్లోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తండ్రి పహర్‌గంజ్‌లో ఉంటూ ప్రింటింగ్ ప్రెస్ బిజినెస్ చూసుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories