Karnataka drug case : ఇద్దరు పోలీసు అధికారుల సస్పన్షన్

Karnataka drug case : ఇద్దరు పోలీసు అధికారుల సస్పన్షన్
x
Highlights

కర్ణాటక మాదకద్రవ్యాల కేసు విచారణ ను రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో రాష్ట్ర అంతర్గత భద్రత విభాగం.. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి)కి అప్పగించింది. ఒకే అంశంపై...

కర్ణాటక మాదకద్రవ్యాల కేసు విచారణ ను రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో రాష్ట్ర అంతర్గత భద్రత విభాగం.. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి)కి అప్పగించింది. ఒకే అంశంపై రెండు సంస్థలు విచారణ చేపడితే కేసు పక్కదారి పడే అవకాశం ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు వివరాలు బయటకు లీక్ అవుతున్నాయన్న సమాచారంతో ఇద్దరు పోలీస్ అధికారులు సస్పెండ్ చేశారు. ఇక డ్రగ్స్ కేసులో తాజాగా కేరళకు చెందిన డేనియల్, గోకుల్ కృష్ణ లను విచారించిన పోలీసులు, వారి సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు.. అలాగే విచారణకు హాజరు కావాల్సిందిగా మరికొందరికి నోటీసులు జారీ చేశారు. బెంగళూరు-ముంబై, గోవా- బెంగళూరు, మంగళూరు- బెంగళూరు మధ్య మాదకద్రవ్యాల సరఫరా చేసే నిందితులపై నిఘా పెట్టిన పోలీసులు..పలువురిని విచారిస్తున్నారు.

మరోవైపు ఏ కేసులో 67 మంది నిందితులను అరెస్ట్ చేసి రూ.6 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. సరకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై ఇప్పటికే ప్రతీక్ శెట్టి అనే వ్యక్తిని సిసిబి పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు మంగళూరులో కళాకారుడు కిషోర్ శెట్టి ని, వీరు గోవా, ముంబై ల నుంచి బెంగళూరు, మంగళూరుకు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. అలాగే డ్రగ్స్ విక్రయాలతో సంబంధమున్న బెంగళూరుకు చెందిన ఓ రెస్టారెంట్ యజమాని కార్తీక రాజును అరెస్ట్ చేశారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories