Two Arrest in Rajasthan for toppling govt: ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

Two Arrest in Rajasthan for toppling govt: ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
x
rajastan
Highlights

Two Arrest in Rajasthan for toppling govt: రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి వేయడానికి, కాంగ్రెస్, స్వతంత్ర ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 20-25 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG ) గుర్తించింది.

Two Arrest in Rajasthan for toppling govt: రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి వేయడానికి, కాంగ్రెస్, స్వతంత్ర ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 20-25 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG ) గుర్తించింది. ఇందులో పాత్ర ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. కాంగ్రెస్ చీఫ్ విప్ మహేష్ జోషి నివేదికపై దర్యాప్తు జరిపిన తరువాత SOG ఈ విషయాన్ని వెల్లడించింది. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ప్రకారం, ఆయుధాల అక్రమ రవాణాకు సంబంధించి నిఘాపై 9929229909 , 8949065678 అనే రెండు మొబైల్ నంబర్లను తీసుకొని పరిశీలించగా.. వీటి ద్వారా ఎమ్మెల్యేల కొనుగోలు మంతనాలు జరిపినట్టు వెల్లడైంది. రాజ్యసభ ఎన్నికలకు ముందు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర పన్నారని దర్యాప్తులో తేల్చింది.

ఈ ఎఫ్‌ఐఆర్‌లో బన్స్‌వరా జిల్లాలోని కుశాల్‌గర్ ‌కు చెందిన మహిళా ఎమ్మెల్యే రమీలా ఖాడియా, మాజీ మంత్రి, ప్రస్తుతం బాన్స్‌వరా జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మహేంద్రజిత్ సింగ్ మాల్వియా పేర్లు వెల్లడయ్యాయని వర్గాలు తెలిపాయి. పెద్ద మొత్తంలో డబ్బును ఎమ్మెల్యేలకు ఆఫర్ చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు చేరుకుంది. దీని తరువాత, రాజ్యసభ ఎన్నికలకు ముందు జైపూర్ ఎస్.ఓ.జి వద్ద చీఫ్ విప్ మహేష్ జోషి వ్రాతపూర్వక నివేదిక ఇచ్చారు.

కాగా జూన్ 10 న, రాజస్థాన్ లో రాజ్యసభ ఎన్నికలకు ముందు, రాజస్థాన్ అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్, మహేష్ జోషి, అవినీతి నిరోధక బ్యూరోకు ఒక లేఖ రాశారు, "మా ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ప్రజా సేవకు అంకితమైన ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేస్తున్నారు' అని లేఖలో ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories