Chhattisgarh: బీజాపుర్ ​అమర జవాన్లకు కన్నీటి వీడ్కోలు

Tribute To the Soldiers in Chattisgarh
x

అమర జవాన్ల నివాళి (ఫైల్ ఇమేజ్)

Highlights

Chhattisgarh: జవాన్ల పార్థీవ దేహాలపై జాతీయ పతాకాన్ని కప్పి.. పుష్పగుచ్చాలతో నివాళులు

Chhattisgarh: మావోయిస్టుల ఘాతుకంతో వీర మరణం పొందిన జవాన్లకు భద్రతా దళాలు అంజలి ఘటించాయి. ఛత్తీస్​గఢ్​ బీజాపుర్​లో అమర జవాన్లకు అధికార లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. జవాన్ల పార్థీవ దేహాలపై జాతీయ పతాకాన్ని కప్పి.. పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. వీర జవాన్ల కుటుంబీకుల రోదనలు అందరినీ కలచివేస్తున్నాయి.

ఇక ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పరిశీలించనున్నారు. మరికాసేపట్లో అక్కడికి చేరుకోనున్నారు. భద్రతా దళాలపై మావోయిస్టులు దాడి చేసిన ప్రాంతాన్ని ఆయన ఉన్నతాధికారులతో కలిసి పరిశీలిస్తారు. అనంతరం.. నక్సల్స్​ కాల్పుల్లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను పరామర్శించనున్నారు. మారణకాండపై ఇప్పటికే ఉన్నతస్ధాయి సమీక్ష నిర్వహించారు హోం మంత్రి. మావోయిస్టులకు సరైన సమాధానం ఇస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories