COVID-19 Care Train Coaches: ఐసోలేషన్‌ వార్డులుగా రైలు బోగీలు

Train Coaches Converted into Isolation Wards for COVID-19
x

COVID-19 Care Train Coaches:(File Image) 

Highlights

COVID-19 Care Train Coaches: దేశంలో 3,816 రైల్వే కోచ్‌లను కొవిడ్‌-19కేర్‌ కేంద్రాలుగా మార్చిన రైల్వేశాఖ

COVID-19 Care Rail Coaches: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉప్పెనలా దూసుకుపోతోంది. నిత్యం లక్షలాది మంది ఈ మహమ్మారి బారిన పడుతుండగా.. వేలాది మంది మరణిస్తున్నారు. ఓపైపు ఆసుపత్రుల్లో బెడ్లు లేక, ఆక్సిజన్ లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో నిత్యం లక్షలాది మందిని గ్యమస్థానాలకు చేర్చే రైలు బోగీలు మళ్లీ ఐసోలేషన్‌ వార్డులుగా మారుతున్నాయి. కరోనా మహమ్మారి ప్రారంభంలో ఆసుపత్రుల్లో పడకల కొరత కారణంగా భారత రైల్వే కోచ్‌లను ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చిన విషయం తెలిసిందే.

కాగా.. సెకండ్‌ వేవ్‌లో కరోనా విజృంభణ ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే దేశంలోని అన్ని ఆసుపత్రుల్లో పడకలు నిండిపోయాయి. ఎక్కడ కూడా ఖాళీగా కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో భారత రైల్వే మరోసారి కోచ్‌లను ఐసోలేషన్ కేంద్రాలుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో 3,816 రైల్వే కోచ్‌లను కొవిడ్‌-19కేర్‌ కేంద్రాలుగా మార్చినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్‌ మేరకు ఈ కోచ్‌లను ఆయా ప్రాంతాల్లో మోహరిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది.

ఈ మేరకు మహారాష్ట్రలోని నందూర్‌బార్ జిల్లాలో 21 కొవిడ్ -19 కేర్ కోచ్‌లను మోహరించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. షుకుర్‌ బస్తీ వద్ద 25, ఆనంద్ విహార్‌లో 25, వారణాసిలో 10, భడోహిలో 10, ఫైజాబాద్ వద్ద 10 కొవిడ్-19 కేర్ కోచ్‌లను అందుబాటులో ఉంచినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఆరోగ్య సంరక్షణ చర్యల్లో భాగంగా మొత్తం 5,601 రైల్‌ కోచ్‌లను కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా మారుస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories