Top News @ 6pm: కొనసాగుతున్న గ్రూప్ 1 టెన్షన్.. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సెటైర్లు.. మరో టాప్ 4 న్యూస్ హెడ్‌లైన్స్
1) Harish Rao: ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి : హరీష్ రావు Harish Rao to Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి పేరు ఎనుముల రేవంత్...
1) Harish Rao: ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి : హరీష్ రావు
Harish Rao to Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటికీ రైతులకు సమయానికి రైతు బంధు రావడం లేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సకాలంలో రైతు బంధు విడుదలయ్యేదని గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొస్తే వృద్ధులకు పెన్షన్ పెంచుతామని చెప్పారు కానీ ఆ 4వేల పెన్షన్ మాట దగానే అయిందని ఆరోపించారు. తులం బంగారం విషయంలో దగాకు పాల్పడ్డారన్నారు. రేవంత్ రెడ్డి మోసాలను అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని చెబుతూ అందుకే ఆయన ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
2) CM Revanth Reddy: తెలంగాణను ట్రిలియన్ డాలర్లకు మార్చడమే మా లక్ష్యం
Revanth Reddy: హైదరాబాద్ గచ్చిబౌలిలో ఐఎస్‌బీ లీడర్‌షిప్ సమ్మిట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. ఐఎస్‌బీ ప్రాంగణంలో రేవంత్‌రెడ్డి మొక్కను నాటారు. ఐఎస్‌బీ విద్యార్థులు కొత్త ఇండియాకు అంబాసిడర్లు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణను ట్రిలియన్ డాలర్లకు మార్చడమే తమ లక్ష్యమని...హైదరాబాద్‌ను 600 బిలియన్ డాలర్ల నగరంగా మార్చాలన్నారు. అంతర్జాతీయ నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలని తెలిపారు. హైదరాబాద్‌ను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతామని.. స్కిల్, స్పోర్ట్స్ వర్సిటీలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు.
3) Group 1 mains exams: తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలతో అశోక్ నగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాయి. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయడం, జీవో 29 రద్దు వంటి డిమాండ్లతో శుక్రవారం అభ్యర్థులు అశోక్ నగర్‌లో ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలో పాల్గొన్న అభ్యర్థులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన సంగతి తెలిసిందే. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
4) Tirumala: దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురికి నోటీసులు జారీ
Tirumala: ఎమెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురికి తిరుమల పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41A కింద నోటీసులు ఇచ్చారు. పవిత్రమైన తిరు మాడ వీధుల్లో పబ్లిక్ న్యూసెన్స్ చేస్తూ రీల్స్ చేశారని ఎమెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిపై ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్, మాధురి విచారణకు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.
కొద్దిరోజుల క్రితం దివ్వెల మాధురితో పాటు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. అనంతరం వీరిద్దరు కలిసి మాడవీధుల్లో హల్ చల్ చేశారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. తమ మధ్య ఉన్న సంబంధం గురించి వివరించారు. తాము ఇంకా పెళ్లి చేసుకోలేదని.. కోర్టుల్లో కేసులు కొలిక్కివచ్చాక పెళ్లి చేసుకుంటామని చెప్పారు. అయితే తిరుమలలో ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం కావడంతో.. దివ్వల మాధురిపై కేసు నమోదైంది. టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి విచారణలో భాగంగా నోటీసులు జారీ చేశారు.
5) Delhi Blast: ఢిల్లీ పేలుడు ఘటన వెనుక అనేక అనుమానాలు.. రంగంలోకి NIA
Delhi Blast: ఢిల్లీలోని రోహిణి వద్ద ఉన్న సీఆర్పీఎఫ్ స్కూల్ బయట భారీ పేలుడు సంభవించిన ఘటన దేశ రాజధానిలో కలకలం సృష్టించింది. పేలుడు జరిగిన తీరు చూస్తోంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. షాక్ వేవ్స్ సృష్టించే విధంగా పేలుడు జరగడం వల్ల అక్కడ చుట్టూ ఉన్న భవనాలు, వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎయిర్, లిక్విడ్ రెండూ కలిపి ఒక గ్యాస్‌గా మార్చి దానిని వేడెక్కించి పేల్చడం ద్వారా ఇలాంటి షాక్ వేవ్స్ సృష్టించవచ్చని వార్తా కథనాలు చెబుతున్నాయి. పేలుడు ధాటికి సూపర్ సోనిక్ వేగంతో వ్యాపించిన ఈ షాక్ వేవ్స్ తగలడం వల్ల అక్కడి భవనాలు, వాహనాల అద్దాలు ధ్వంసమయ్యుంటాయని ప్రాథమిక అంచనాకు వస్తున్నారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6) Hindus Safety in Canada: కెనడాలో హిందువులకు రక్షణపై భారత సంతతి ఎంపీ ఆందోళన.. ప్రధాని ట్రూడోకు విజ్ఞప్తి
Hindus Safety in Canada: కెనడాలో హిందువులకు ఆపద పొంచి ఉందని అక్కడి భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్య ఆందోళన వ్యక్తంచేశారు. కెనడాలో ఖలిస్థానీ ఉద్యమం పేరుతో జరుగుతున్న అనేక పరిణామాలనే ఆయన అందుకు కారణంగా చూపించారు. కెనడాలో ఉంటున్న హిందువులంతా ఇప్పుడు తమ రక్షణ కోసం ఆందోళన చెందుతున్నారని చంద్ర ఆర్య కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దృష్టికి తీసుకెళ్లారు. ఆందోళన చెందుతున్న వారిలో తాను కూడా ఉన్నానని తెలిపారు. ఇకనైనా ఖలిస్థానీ సంఘాల నుండి హిందువులకు పొంచి ఉన్న ముప్పును గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన జస్టిన్ ట్రూడోకు విజ్ఞప్తి చేశారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire