TOP 6 NEWS @ 6PM: కొడంగల్ దాడిలో పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్.. మరో 5 ముఖ్యాంశాలు

top 6 news today  13 november 2024
x

కొడంగల్ దాడిలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్: మరో 5 ముఖ్యాంశాలు

Highlights

1.కొడంగల్ దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా ఇతర...

1.కొడంగల్ దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా ఇతర అధికారులపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. హైద్రాబాద్ కేబీఆర్ పార్క్ లో ఇవాళ మార్నింగ్ వాక్ కి వెళ్లిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి వికారాబాద్ కు తరలించారు. ఈ కేసులో ఆయనను ప్రశ్నించిన తర్వాత కొడంగల్ కోర్టులో హాజరుపర్చారు. నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. రెండు రోజుల క్రితం లగచర్లలో జరిగిన దాడి కేసులో ఏ1 నిందితుడు సురేశ్ తో నరేందర్ రెడ్డి 42 సార్లు ఫోన్ లో మాట్లాడిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. దుద్యాల మండలంలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటును స్థానిక రైతులు వ్యతిరేకిస్తున్నారు.

2.శ్రీరెడ్డిపై బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో కేసు

సినీ నటి శ్రీ రెడ్డిపై తూర్పు గోదావరి జిల్లా బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ ఫిర్యాదుతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అనితపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పద్మ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ, జనసేన నాయకులపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని ఈ రెండు పార్టీల నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, ఈ ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అప్పట్లో ఆరోపణలు చేశారు.జగన్ అధికారానికి దూరమైన తర్వాత మరోసారి ఈ రెండు పార్టీల నాయకులు ఫిర్యాదు చేస్తున్నారు.

3.స్టాక్ మార్కెట్ లో భారీ నష్టాలు

స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిశాయి. అక్టోబర్ లో 14 నెలల గరిష్టానికి చేరడంతో ఇప్పట్లో వడ్డీరేట్లు తగ్గవనే అంచనాలు మదుపర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ ల నుంచి ప్రతికూల సంకేతాలు, రూపాయి విలువ పడిపోవడం కూడా ఇందుకు కారణం.దీంతో వరుసగా ఐదో రోజూ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ ఒకానొక సమయంలో 1100 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ కూడా 23,600 దిగువకు చేరింది. బుధవారం ఉదయం78,495.53 పాయింట్ల నష్టాలతో ప్రారంభమైంది.నష్టాలతోనే రోజంతా కొనసాగింది. తర్వాత కొంత కోలుకొని 984 పాయింట్ల నష్టంతో 77,690.95 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 324 పాయింట్ల నష్టంతో 23,559.05 వద్ద స్థిరపడింది.

4.అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడితే తప్పేంటి: ఏపీ హైకోర్టు

సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినవారిపై కేసులు పెడితే తప్పేం ఉందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రశ్నించింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై అక్రమ కేసులు పెడుతున్నారని దాఖలైన పిల్ పై హైకోర్టు విచారించింది. న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టారని కోర్టు గుర్తు చేసింది.

5.పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఊరట

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ కు ఊరట దక్కింది. రెండేళ్ల క్రితం సెక్షన్ 144 ఉల్లంఘన కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఇమ్రాన్ సహా మరికొందరికి కోర్టు నిర్ధోషులుగా నిర్ధారించింది. ఇస్లామాబాద్ లోని జిల్లా సెషన్స్ కోర్టు ఈ తీర్పును వెల్లడించింది. పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పీటీఐ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనపై 2022 ఆగస్టు 20న కేసు నమోదైంది.

6.జార్ఖండ్ లో 64.86 శాతం, వయనాడ్ లో60.79 శాతం పోలింగ్

జార్ఖండ్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల్లో బుధవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 43 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్ లో 64.86 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాహుల్ గాంధీ రాజీనామాతో కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది.ఈ స్థానానికి 60.79 శాతం ఓట్లు పోలయ్యాయి. దేశంలోని 10 రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories