Top 6 News Of The Day: హైడ్రాపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం.. మరో టాప్ 5 హెడ్‌లైన్స్

Top 6 News Of The Day: హైడ్రాపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం.. మరో టాప్ 5 హెడ్‌లైన్స్
x
Highlights

1) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీం కోర్టు విమర్శలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

1) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీం కోర్టు విమర్శలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడానికి కారణం బీజేపి, బీఆర్ఎస్ పార్టీల మధ్య జరిగిన రహస్య ఒప్పందం అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తప్పుపట్టింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అంత నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడతారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. 2015 నాటి ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున.. ఆ కేసు విచారణను మధ్యప్రదేశ్ హై కోర్టుకు బదిలీ చేయాల్సిందిగా దాఖలైన పిటిషన్ నేడు సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున వారు సాక్ష్యులను ప్రభావితం చేయడంతో పాటు ఆధారాలను తారుమారు చేయొచ్చని పిటిషనర్స్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌పై వాదనల సందర్భంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2) మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం

మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం అయ్యారు. సమావేశానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా ను విస్తరించాలనే డిమాండ్ పై చర్చించారు. హైడ్రాకు వ్యతిరేకంగా పలువురు నేతలు కోర్టును ఆశ్రయించారు. నేతలు కోర్టుకు వెళ్లడంపై ఏం చేయాలనే దానిపై చర్చించారు. హైడ్రా కు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

3) నాన్నను కలిసిన కవిత రియాక్షన్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ వచ్చిన తరువాత ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్‌‌ను కలిశారు. హైదరాబాద్‌ నుంచి ఉదయాన్నే బయల్దేరిన ఆమె సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉన్న ఫాంహౌజ్‌కి చేరుకున్నారు. ఆమె వెంట భర్త అనిల్, కుమారుడు కూడా ఉన్నారు. ఆమెకు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. కవితకు బెయిల్ రావడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్.. కవితను చూసిన వెంటనే ఆమెను హత్తుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆమె కేసీఆర్ పాదాలకు నమస్కరించారు.

4) నోటీసులకు స్పందించిన రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి

బఫర్ జోన్‌లో ఉన్న నిర్మాణాలపై హైడ్రా ఉక్కు పాదం మోపుతోంది. ఈ నేపథ్యంలోనే దుర్గం చెరువులో ఉన్న సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటిని బఫర్ జోన్‌లో గుర్తించినట్టు హైడ్రా అధికారులు తిరుపతిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. హైడ్రా నోటీసులపై తిరుపతి రెడ్డి స్పందించారు. తాను 2015లో ఈ నివాసం కొనుగోలు చేసినప్పుడు పత్రాలు అన్ని క్లియర్‌గా ఉన్నాయన్నారు. ఇప్పడు అధికారులు బఫర్ జోన్‌లో ఉందని చెబుతున్నారని.. అదే నిజమైతే అధికారుల చర్యలకు అభ్యంతరం చెప్పనని అన్నారు.

5) బాలీవుడ్‌ నటి ఇష్యూపై సర్కార్‌ సీరియస్‌.. ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశాలు

ముంబై నటి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఉన్నతస్థాయి దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఐపీఎస్‌ల ప్రమేయం ఉండడంతో... కేసును సీరియస్‌గా తీసుకుంది. ముంబై నటితో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు తీసుకోవాలని ఆదేశించింది. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సీఎంవో ఆదేశాలు జారీ చేసింది. ఇక ముంబై నటి కేసుపై విజయవాడ సీపీ రాజశేఖర్‌ స్పందించారు. కేసులో పోలీసులపై ఆరోపణలు వచ్చాయని.. కేసుకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. ప్రధానంగా ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు వచ్చాయని.. ఎంతవరకు వాస్తవం ఉందో లోతుగా తెలుసుకుంటున్నామన్నారు. డీజీపీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

6) ఇద్దరు ఎంపీల రాజీనామా

వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా రాజ్యసభ పదవికి, వైసీపీకి మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావులు రాజీనామా చేశారు. పార్లమెంట్‌లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ని కలిసి తమ రాజీనామాలను సమర్పించారు. ఆ తరువాత వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories