Top 6 News Of The Day: భారత కమ్యూనిస్టు రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన తెలుగు యోధుడు సీతారాం ఏచూరి కన్నుమూత.. మరో టాప్ 5 హెడ్‌లైన్స్

Top 6 News Of The Day: భారత కమ్యూనిస్టు రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన తెలుగు యోధుడు సీతారాం ఏచూరి కన్నుమూత.. మరో టాప్ 5 హెడ్‌లైన్స్
x
Highlights

1) కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపూడి గాంధీ: ఇరువర్గాల మధ్యఘర్షణ, ఉద్రిక్తత బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి తన అనుచరులతో శేరిలింగంపల్లి...

1) కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపూడి గాంధీ: ఇరువర్గాల మధ్యఘర్షణ, ఉద్రిక్తత

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి తన అనుచరులతో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి పై అరికెపూడి గాంధీ అనుచరులు కోడిగుడ్లు, టమాటలతో దాడికి దిగారు. అ బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్ణణ చోటు చేసుకుంది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బీఆర్ఎస్‌లో ఉన్నారని రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో ప్రకటించారు. అందుకే తనకు పీఏసీ ఛైర్మన్ పదవిని ఇచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ లో ఉన్నానని గాంధీ ప్రకటించినందున ఆయన ఇంటికి తాను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి సెప్టెంబర్ 12న ఉదయం 11 గంటలకు వస్తానని చెప్పారు. గాంధీ ఇంటిపై బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి ఆయనను బీఆర్ఎస్ కార్యాలయానికి తీసుకువచ్చి మీడియాతో మాట్లాడతానని ప్రకటించారు. ఈ సవాల్ కు అరికెపూడి గాంధీ కూడా స్పందించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2) కౌశిక్‌ రెడ్డిపై దాడిని ఖండించిన కేటీఆర్

కౌశిక్‌రెడ్డిపై దాడిని మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నం జరిగిందన్నారు. తెలంగాణను రౌడీ రాజకీయాలకు అడ్డాగా మార్చారని అన్నారు. కాంగ్రెస్ హత్యా రాజకీయాలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కౌశిక్‌ రెడ్డిని గృహనిర్బంధంలో ఉంచి అరికెపూడి గాంధీ గూండాలతో దాడి చేయిస్తారా అని ప్రశ్నించారు. ఇది కచ్చితంగా సీఎం రేవంత్‌ రెడ్డి చేయించిన దాడేనని అన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

3) స్థానికత రిజర్వేషన్ అంశంపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్

స్థానికత రిజర్వేషన్ అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ శాశ్వత నివాసులు రాష్ట్రం బయట చదువుకున్నంత మాత్రానా స్థానిక రిజర్వేషన్ వర్తించదంటూ ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చింది. అయితే ఈ నిబంధనను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించింది. తెలంగాణలో చదువుకోలేన్న కారణంతో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లను నిరాకరించరాదని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని శంకర్ నారాయణ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. స్పందించిన న్యాయస్థానం త్వరలోనే విచారణ జాబితాలో చేరుస్తామని సీజేఐ చంద్రచూడ్ స్పష్టం చేశారు.

4) ఏపీ, తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. భారీ వర్షాలు కురిసే ఛాన్స్

గత కొన్నాళ్లుగా ఎడతెరిపిలేని వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. తెలుగు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో చిగురుటాకులా వణికిపోయాయి. భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ఈమధ్య కురిసిన భారీ వర్షాల కారణంగా ఖమ్మం, విజయవాడ ప్రాంతాలు వరద ముంపునకు గురైన సంగతి తెలిసిందే. మున్నేరులోకి రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చింది చేరింది. దీంతో ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. బుడమేరుకు గుండ్లు పడటంతో విజయవాడలోని పలు డివిజన్లలోకి వరదనీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5) ఫిరాయింపు చట్టంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

ఫిరాయింపు చట్టంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు చట్టం ఎంత కఠినంగా ఉంటే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. చట్టం కఠినంగా ఉంటే తమ ప్రభుత్వానికే మేలన్న సీఎం రేవంత్.. ఎమ్మె్ల్యేలు పార్టీ మారకుంటే తమ ప్రభుత్వం బలంగా ఉంటుందన్నారు. ఫిరాయింపులు మొదలుపెట్టిన వాళ్లే ఇప్పుడు నీతులు చెబుతున్నారన్నారు సీఎం రేవంత్. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్ కుటుంబం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక పీఏసీ ఛైర్మన్ పదవిపై బీఆర్ఎస్‌ నేతల వ్యాఖ్యలపైనా మండిపడ్డారు సీఎం రేవంత్. 2019 నుంచి కాంగ్రెస్‌కు కాకుండా అప్పటి బీఆర్ఎస్‌ ప్రభుత్వం అక్బరుద్దీన్‌కు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు.

6) సీతారాం ఏచూరి: భారత కమ్యూనిస్టు రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన తెలుగు యోధుడు

సీతారాం ఏచూరి.. తెలుగు వారికే కాదు, జాతీయ రాజకీయాల గురించి కొద్దిపాటి అవగాహన ఉన్న వారికి కూడా కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఎర్ర జెండా పట్టుకుని ఎన్నో ప్రజా ఉద్యమాలను ముందుండి నడిపించిన నాయకుడు ఆయన. విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన ఏచూరి కొద్ది కాలంలోనే జాతీయ స్థాయికి ఎలా ఎదిగారు? అసలు ఆయన నేపథ్యం ఏంటి? ఎందుకు ఎర్రజండా పట్టుకోవాల్సిన అవసరం వచ్చింది? సీతారాం ఏచూరి రాజకీయ జీవితానికి ఎక్కడ పునాది పడింది, ఏ నిర్ణయంతో ఏచూరి జీవితం ఈ మలుపు తిరిగింది అనే అనేక ఆసక్తికరమైన అంశాలతో.. సీతారాం ఏచూరి రియల్ లైఫ్ జర్నీ పూర్తి కథనం

Show Full Article
Print Article
Next Story
More Stories