Top 6 News Of The Day: మహిళపై ఎమ్మెల్యే లైంగిక వేధింపులు.. సస్పెండ్ చేసిన టీడీపీ.. మరో టాప్ 5 హెడ్‌లైన్స్

Top 6 News Of The Day: మహిళపై ఎమ్మెల్యే లైంగిక వేధింపులు.. సస్పెండ్ చేసిన టీడీపీ.. మరో టాప్ 5 హెడ్‌లైన్స్
x
Highlights

నీట్, MBBS స్థానికతపై తెలంగాణ హైకోర్టు తీర్పు నీట్, MBBS స్థానికతపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. తెలంగాణలో శాశ్వత చిరునామా ఉన్నవారికి...

నీట్, MBBS స్థానికతపై తెలంగాణ హైకోర్టు తీర్పు

నీట్, MBBS స్థానికతపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. తెలంగాణలో శాశ్వత చిరునామా ఉన్నవారికి అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి.. తెలంగాణలో లోకల్‌గా ఉన్నవారిని నాన్ లోకల్‌గా పరిగణిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. స్థానికులు, స్థానికేతరులకు రూల్స్ రూపొందించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కొణతం దిలీప్‌ అరెస్ట్.. విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్

కొణతం దిలీప్‌ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అభియోగాలతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం. ఆసిఫాబాద్ జిల్లా జైనూరు ఘటనపై సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టారని ఫిర్యాదులు రావడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా ఆయన పనిచేశారు. సీసీఎస్‌కు దిలీప్‌ను పోలీసులు తీసుకెళ్లారనే విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా పలువురు నాయకులు చేరుకున్నారు. కొణతం దిలీప్ అరెస్ట్‌ని కేటీఆర్ ఖండించారు. ప్రశ్నించే వాళ్లను అరెస్ట్ చేయడం సమస్యలకు పరిష్కారం కాదన్న కేటీఆర్.. తక్షణమే దిలీప్‌ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

విజయవాడకు కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌

విజయవాడలో కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ పర్యటన కొనసాగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు ఏపీకి చేరుకున్న చౌహాన్‌, మంత్రి నారా లోకేష్‌తో కలిసి వరద ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. బుడమేరు, జక్కంపూడి, కండ్రిక, అజిత్ సింగ్ నగర్‌లలో వరదలను ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించారు. జక్కంపూడి కాలనీ మిల్క్ ఫ్యాక్టరీ ప్రాంతంలో బోట్లలో వెళ్లి పరిశీలిస్తారు. ఏరియల్ వ్యూ అనంతరం సీఎం నివాసానికి వెళ్లిన చౌహాన్ అక్కడి నుండి ప్రకాశం బ్యారేజ్‌కి వెళ్లి దెబ్బతిన్న గేట్లను పరిశీలించారు.

కేజ్రీవాల్‌కు ఇంకా తప్పని ఎదురుచూపులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కు ఇంకా ఊరట లభించలేదు. సీబీఐ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. సెప్టెంబరు 10న తీర్పు వెలువరించనున్నట్టు వెల్లడించింది. లిక్కర్ స్కాం కేసుకు సంబంధించిన సీబీఐ కేసులో తన అరెస్టును సవాల్‌ చేయడంతో పాటు.. బెయిల్‌ కోసం అభ్యర్థిస్తూ సుప్రీం కోర్టులో కేజ్రీవాల్‌ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ సందర్భంగా కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి వాదిస్తూ.. సీబీఐ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యం విధానంపై కేసు నమోదు చేసిన తర్వాత రెండేళ్ల వరకు సీఎంను అరెస్టు చేయలేదని... ఎప్పుడైతే ఈడీ కేసులో బెయిల్‌ వచ్చిందో.. వెంటనే సీబీఐ ఇన్స్యూరెన్స్ అరెస్టుకు పాల్పడిందన్నారు. ఇది కేవలం కేజ్రీవాల్‌ని జైల్లో పెట్టడం కోసం చేసిన కుట్రగానే అర్థం అవుతోందని సింఘ్వీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

అత్యంత రహస్యాలు బయటపెడతానంటున్న ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే దేశంలోని అత్యంత రహస్య విషయాలను బయటపెడతానని రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. ఓ పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో మాట్లాడుతూ... పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ అధ్యక్షుడు జాన్ కెన్నడీ హత్యకు సంబంధించిన పత్రాలు, పలు రహస్యాలను బహిర్గతం చేస్తానని హామీ ఇచ్చాను. కెన్నడీ విషయంలో రహస్యాలు బయటపెట్టాలని తనను డెమోక్రాట్లే కోరుతున్నారనన్నారు. ఇప్పటికే చాలా పత్రాలను తాను విడుదల చేసినట్లు చెప్పారు. చాలా మంది తన వద్దకు వచ్చి అలా చేయవద్దని కోరుతున్నారు.. కానీ, తాను వాటిని ముందే విడుదల చేస్తానని స్పష్టం చేశారు.

లైంగిక వేధింపులు.. ఎమ్మెల్యే సస్పెన్షన్

టీడీపీ నుంచి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెన్షన్‌‌‌కు గురయ్యాడు. ఆదిమూలంను టీడీపీ అధిష్టానం సస్పెండ్‌ చేసింది. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆదిమూలంపై చర్యలు తీసుకుంది టీడీపీ అధిష్టానం. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించారు. తనపై మూడుసార్లు లైంగికదాడికి పాల్పడ్డారని ఆమె చెప్పారు. హైద్రాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో బాధితురాలు గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని ప్రైవేట్ వీడియోలను ఆమె విడుదల చేశారు. ఈ విషయమై న్యాయం చేయాలని ఆమె కోరారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories