Top 6 News @ 6 PM: నేను హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి.. పవన్: మరో 5 ముఖ్యాంశాలు

Top 6 News @ 6pm
x

Top 6 News @ 6 pm

Highlights

Top 6 News @ 6pm: ఇవాళ నవంబర్ 4న తెలంగాణ, ఏపీ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాల్లో చోటుచేసుకున్న ముఖ్యమైన ఘటనలు, వాటికి సంబంధించిన వార్తాంశాలను ఒకే చోట పొందుపరుస్తూ టాప్ 6 న్యూస్ @ 6PM పేరుతో క్లుప్తంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది.

Top 6 News @ 6pm: ఇవాళ నవంబర్ 4న తెలంగాణ, ఏపీ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాల్లో చోటుచేసుకున్న ముఖ్యమైన ఘటనలు, వాటికి సంబంధించిన వార్తాంశాలను ఒకే చోట పొందుపరుస్తూ టాప్ 6 న్యూస్ @ 6PM పేరుతో క్లుప్తంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది.

నేను హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి.. పవన్

తాను హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు చాలా వేరుగా ఉంటాయని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు హైస్కూల్ లో సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలు అలానే వచ్చాయి. అప్పడు చేసిన నేరాలు, అలసత్వం కూడా ఇప్పటికీ కొనసాగుతోందని ఆయన చెప్పారు. అప్పుడు చేసిన నేరాలు, అలసత్వం కూడా ఇప్పటికీ కొనసాగుతోందన్నారు.ఇలాగే ఏం చేయకుండా నిశ్చలంగా ఉండండి.. హోం శాఖ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. గుర్తు పెట్టుకోండని ఆయన చెప్పారు. ధైర్యం లేనప్పుడు పోలీసులు ఉండడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. నాయకులు ఉన్నది ఓట్లు అడగడానికేనా? బాధ్యతలు నిర్వర్తించడానికి కాదా? అని అడిగారు. తాను హోంశాఖ తీసుకోలేక కాదు.. తాను హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. యూపీలో క్రిమినల్స్ కు యోగి ఆదిత్యనాథ్ ఎలా చేస్తున్నారో... ఇక్కడ కూడా అలానే చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ ను సోమవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. 2025 జనవరి 1 నుంచి 20 వరకు హిస్తారు. ఈ నెల 20 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2025 జనవరి 1 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది మే లో నిర్వహించిన టెట్ పరీక్షకు 2,35,000 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. 1,09, 000 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. తెలంగాణలో ఇప్పటివరకు 10 సార్లు టెట్ పరీక్షలు నిర్వహించారు. 2025 జనవరిలో నిర్వహించే టెట్ పరీక్ష పదకొండో పరీక్ష. ఈ ఏడాది ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసింది. ఈ జాబ్ క్యాలెండర్ విడుదల సమయంలో రెండు సార్లు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ హమీ మేరకు రెండోసారి టెట్ పరీక్షను నిర్వహించేందుకు ఇవాళ నోటిఫికేషన్ జారీ చేశారు. టెట్ పేపర్-1 కు డీఈడీ, పేపర్-2 కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందేందుకు టెట్ అర్హత ఉండాలి. దీంతో టెట్ పరీక్ష రాసేందుకు ప్రస్తుతం టీచర్ ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా దరఖాస్తులు చేస్తారు.

ఆగ్రా సమీపంలో కుప్పకూలిన మిగ్-29 విమానం

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా సమీపంలో మిగ్-29 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. పంజాబ్ లోని అదంపూర్ నుంచి బయలుదేరిన ఫైటర్ జెట్ ఆగ్రా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్టు రక్షణశాఖ అధికారులు తెలిపారు.

కెనడాలో హిందూ దేవాలయం దాడి

కెనడాలో ఖలిస్తానీలు హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారు. దీనిని ఆ దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో తీవ్రంగా పరిగణించారు. ఈ దాడులు ఏ మాత్రం ఆమోదయోగ్యం కావని ఆయన చెప్పారు.దాడి జరిగిన బ్రాంప్టన్ ఆలయం వద్ద భారీగా భద్రతా దళాలను మోహరించారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి ఎవరినీ అరెస్ట్ చేయలేదని పీల్ రీజినల్ పోలీస్ విభాగం ప్రతినిధి చెప్పారు. ఘర్షణకు సంబంధించి స్పష్టమైన కారణాలు తెలియదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనను నిరసిస్తూ కెనడాలో హిందూవులు ఆందోళనకు దిగారు.

నవంబర్ 8న రేవంత్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర

ఈ నెల 8న భువనగిరి నుంచి వలిగొండ వైపు మూసీ వెంట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తారు. తన పుట్టిన రోజును పురస్కరించుకొని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలో ఆయన ఈ నెల 8న ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు మంచినీరు సరఫరాకు సంబంధించిన పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. మూసీని పునరుజ్జీవ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. దీనికి సంబంధించిన ఈ నెలలో పనులు ప్రారంభించాలని భావిస్తోంది. మూసీ వెంట నివాసం ఉంటున్నవారిని ఖాళీ చేయించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

మహారాష్ట్ర డీజీపీ బదిలీ:ఎందుకంటే?

మహారాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లాను సోమవారం బదిలీ చేశారు. విపక్షాల ఫోన్లను ట్యాప్ చేశారని ఆ పార్టీ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఆమెను బదిలీ చేసింది ఈసీ. విపక్షాలు ఏం చేస్తున్నాయో తెలుసుకుని ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు సమాచారం ఇచ్చారని శివసేన (ఉద్ధవ్ ) వర్గం నాయకులు సంజయ్ రౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నాయకులు కూడా ఆమెపై ఫిర్యాదు చేశారు. దీంతో డీజీపిని తప్పిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. అర్హత కలిగిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లను పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది ఈసీ.

Show Full Article
Print Article
Next Story
More Stories