Top 6 News Of The Day: విజయవాడకు మరోసారి వరద ముప్పు.. మరో టాప్ 5 ముఖ్యాంశాలు

Top 6 News Of The Day: విజయవాడకు మరోసారి వరద ముప్పు.. మరో టాప్ 5 ముఖ్యాంశాలు
x
Highlights

1) సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్,...

1) సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ

సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి టెర్మినల్..రోడ్ల విస్తరణకు సహకారం అందించాలని కిషన్‌రెడ్డి లేఖలో తెలిపారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వస్తారని...వీలైనంత త్వరగా రోడ్లను పూర్తిచేయాలని కోరారు. కాగా, ఇటీవల తెలంగాణలో కేంద్ర రైల్వేశాఖ సహాయ రన్విత్‌ సింగ్‌ బిట్టు పర్యటించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి టెర్మినల్.. రోడ్ల విస్తరణకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రోడ్ల విస్తరణ కోసం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.

2) పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు.. స్పందించిన హైకోర్టు

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన ఉన్నత న్యాయస్థానం తీర్పును వెల్లడిస్తూ నాలుగు వారాల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. స్పీకర్ చర్యలు తీసుకోకపోతే సుమోటోగా తీసుకొని కేసు విచారిస్తామని హైకోర్టు తెలిపింది. పూర్తి వార్తా కథనం..

3) ప్రతి కుటుంబానికి రూ. 17,500

వరదల్లో సర్వం కోల్పోయిన ప్రతి కుటుంబానికి రూ. 17,500 ఇవ్వనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇంత తక్కువ డబ్బు బాధితులకు సరిపోదనే విమర్శలు వస్తున్నాయి. అయితే, ప్రభుత్వ పథకాలతోపాటు ఈ మధ్యే రుణమాఫీ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం, ఇంకా రైతు భరోసా కూడా ఇవ్వాల్సి ఉండటం వంటి పరిస్థితుల్లో ఇప్పుడు వరద బాధితులకు ఎక్కువ మొత్తం ఇచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. పూర్తి వార్తా కథనం...

4) విజయవాడకు మరోసారి వరద ముప్పు

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు విజయవాడను అతలాకుతలం చేశాయి. ఇప్పటికీ విజయవాడ నగరం జలదిగ్బంధంలోనే ఉండగా.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరోసారి విజయవాడకు వరద ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. బుడమేరు పరివాహక ప్రాంతాలకు కృష్ణా ఇరిగేషన్ సర్కిల్ అధికారులు అదివారం అర్థరాత్రి హై అలర్ట్ హెచ్చరికలను జారీ చేశారు. దీంతో సోమవారం తెల్లవారు జాము నుంచి పోలీసులు , రెవిన్యూ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పూర్తి వార్తా కథనం...

5) ఏపీ ఎక్సైజ్‌శాఖ కీలక నిర్ణయం

వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సెబ్‌ పూర్తిగా రద్దు కానుంది. దీనికి కేటాయించిన 4వేల 393 మంది ఎక్సైజ్‌ సిబ్బందిని తిరిగి మాతృశాఖలోకి తీసుకురానున్నారు. సెబ్‌ ఏర్పాటు కాకముందు ఎక్సైజ్‌శాఖ స్వరూపం ఎలా ఉండేదో అదే తరహా వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించనున్నారు. ఇవాళ లేదా రేపు దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు విడుదల కానున్నాయి. ఒక్కో ఉమ్మడి జిల్లాకు ఒక్కో డిప్యూటీ కమిషనర్‌ను ఎక్సైజ్‌శాఖ పరిపాలన వ్యవహారాల బాధ్యతలు చూడటం కోసం నియమించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 208 సెబ్‌ స్టేషన్లు ఉన్నాయి. వీటన్నింటినీ ఎక్సైజ్‌ స్టేషన్లుగా మార్చనున్నారు. ప్రతి స్టేషన్‌కు ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి S.H.O గా ఉంటారు.

6) కోల్‌కత్తా అత్యాచారం ఘటనలో విచారణ వాయిదా

కోల్‌కత్తా అత్యాచారం ఘటనలో ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు విధులకు హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశించింది. విధులకు హాజరుకాకుంటే... ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. పశ్చిమబెంగాల్‌లో ఏం జరుగుతుందో తమకు అవగాహన ఉందని పేర్కొంది. 28 రోజులుగా రెసిడెంట్ డాక్టర్లు ఆందోళనలో ఉండటం కారణంగా... 27 మంది మృతి చెందగా.... సుమారు 6 లక్షల మంది చికిత్సకు నోచుకోలేదని తెలిపింది. పూర్తి వార్తా కథనం..

Show Full Article
Print Article
Next Story
More Stories